Turkey earthquake: భవనాల కింద చిక్కుకున్న టీనేజర్.. ప్రాణాల నిలుపుకోడానికి మూత్రం తాగిన వైనం.. చివరకు ??
భూకంప ప్రభావిత ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారులపై మంచు కురుస్తోంది. రోడ్లు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన విమానాశ్రయాలు మూతపడటంతో.. ప్రపంచ దేశాల నుండి అందే సహాయం కూడా టర్కీకి సరిగ్గా చేరుకోలేకపోయింది.
భూకంపం కారణంగా అతలాకుతలమైన టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంప కేంద్రమైన దక్షిణ గాజియాంటెప్ ప్రావిన్స్‌లో కూలిపోయిన అపార్ట్‌మెంట్ భవనం కింద నుండి 17 ఏళ్ల బాలుడిని టర్కీ రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు లాగారు. భూకంపం సంభవించిన 94 గంటల తర్వాత యువకుడిని బయటకు తీశారు. ఇంత కాలం తిండి లేకుండా బతకడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి అతడు చెప్పిన సమధానం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భవన శిథిలాల కింద ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు.. తన మూత్రం తాగి బతికినట్టుగా చెప్పాడు. ఇది విన్న రెస్క్యూటీం, అధికారులు విస్తుపోయారు. అద్నాన్ ముహమ్మద్ కోర్కుట్ అనే యువకుడిని గజియాంటెప్‌లోని సెహిత్‌కామిల్ జిల్లాలో గురువారం అర్థరాత్రి అపార్ట్‌మెంట్ శిథిలాల నుండి రక్షించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ హృదయవిదారక సంఘటన సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
శిథిలాల నుంచి కోర్కుట్‌ను బయటకు లాగిన సిబ్బంది..అతనితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఎలా బతికవని సిబ్బంది ప్రశ్నించగా..;నేను నా మూత్రం తాగి బ్రతకగలిగాను. ఓహ్ గాడ్, చాలా ధన్యవాదాలు నేను బ్రతికే ఉన్నాను’ అంటూ అతడు చెప్పిన మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ఎవరైనా వస్తారని, తనను కాపాడుతారని ఆశించానన్నాడు. మీరు వచ్చారు ఆ దేవునికి ధన్యవాదాలు. మీ అందరికీ కృతజ్ఞతలు’ అంటూ వైరల్ వీడియోలో పేర్కొన్నాడు. ఇంకా ఏవైనా శబ్ధాలు వినిపించాయా..? అని సిబ్బందిని అడగ్గా కుక్క అరుస్తున్న శబ్దం వినిపించిందని చెప్పాడు. అందుకు రెస్క్యూ సిబ్బంది కుక్కను కూడా రక్షిస్తాం అని చెబుతున్నారు.
?? Gaziantep’te Gölgeler Apartmanında 17 yaşındaki Adnan Muhammet Korkut, 94. saatte enkazdan sağ olarak kurtarıldı.
?️ Kurtarılma anları ve sevdiklerinin mutluluğu pic.twitter.com/ERM6TMTEi8
— Ajansspor (@ajansspor) February 10, 2023
ఆగ్నేయ టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో శక్తివంతమైన వరుస భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. ఇది మొత్తం నగరాలను నాశనం చేసింది, వేలాది మందిని సజీవ సమాధిగా చేసింది. లక్షల మందిని గాయాలపాలు చేసింది. ఇప్పటి వరకు 24 వేల మందికి పైగా మరణించారని సమాచారం. చల్లని వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ వరుసగా నాలుగో రోజు విస్తృతంగా కొనసాగింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం.
శీతాకాలం మంచు తుఫాను కారణంగా సహాయక ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. భూకంప ప్రభావిత ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారులపై మంచు కురుస్తోంది. రోడ్లు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన విమానాశ్రయాలు మూతపడటంతో.. ప్రపంచ దేశాల నుండి అందే సహాయం కూడా టర్కీకి సరిగ్గా చేరుకోలేకపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..