పోకిరీ పోరడు ఆంటీకి ప్రపోజ్‌ చేశాడు..! మహిళ ఇచ్చిన షాక్‌తో మరెవరూ అలాంటి సాహసం చేయరు..

రోడ్డుపై వెళ్తున్న మహిళను చూసి అతను నీచంగా మాట్లాడుతున్నాడని, అతడి మాటలు మళ్లీ చెప్పడానికి సిగ్గుపడుతున్నాను అంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ వయసు ఎంత..? నా వయసు ఎంత?

పోకిరీ పోరడు ఆంటీకి ప్రపోజ్‌ చేశాడు..! మహిళ ఇచ్చిన షాక్‌తో మరెవరూ అలాంటి సాహసం చేయరు..
Boy Love Proposal
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 10, 2023 | 10:00 PM

ప్రేమకు లింగం, వయస్సు, కులం, జాతి, మతం అనే వివక్ష ఉండదు. మనసు కోరుకున్న వెంటనే ప్రేమలో పడే సమయం ఇది. ఇకపై ఏ మనిషి తన ప్రేమను వ్యక్తపరచడం నేరం కాదు. కానీ, అలా చేసే ముందు, దాని పరిణామాలను కూడా ముందుగా ఆలోచించుకోవడం మంచిది. ఒక కాలేజీ కుర్రాడు ఓ మహిళపై తన ప్రేమను చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత అతనికి ఎదురైన ఫలితం ఏ అబ్బాయి అయినా లవ్ ప్రపోజ్ చేసే ముందు వెయ్యిసార్లు ఆలోచించేలా చేస్తుంది. రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో సదరు మహిళ బాలుడికి చెప్పులతో వడ్డించింది. రోడ్డుపై వెళ్తున్న మహిళను చూసి అతను నీచంగా మాట్లాడుతున్నాడని, అతడి మాటలు మళ్లీ చెప్పడానికి సిగ్గుపడుతున్నాను అంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ వయసు ఎంత..? నా వయసు ఎంత? నువ్‌ నాకొడుకు వయసు అంత అంటూ గట్టిగా అరుస్తూ వాడికి సరైన సమాధానం ఇచ్చింది.

రోడ్డుపై వెళ్తున్న మహిళను వేధిస్తూ వెకిలి మాటలు మాట్లాడుతుండగా తోటి వ్యక్తులు కూడా విన్నారు. అందులో ఒక పెద్దాయన ఆ కుర్రాడికి తగిన గుణపాఠం చెప్పాడు. కుర్రాడి చెంపచెల్లుమనిపించాడు. పెద్దాయన చేయిచేసుకోవటం చూసిన ఆ మహిళ కూడా తన చెప్పు చేతిలోకి తీసుకుని చెడామడా వాయించేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

‘ఘర్ కే కాలేష్’ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోను 47 వేల మంది పైగా వీక్షించారు. నెటిజన్లు కూడా భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..