Trump New Rule: సోషల్ మీడియాలో ఆ పోస్ట్‌లు పెడితే.. ఇక మీరు జీవితంలో అమెరికా వెళ్లలేరు!
అమెరికా వచ్చే వలసదారుల ట్రంప్ మరో షాక్ ఇచ్చాడు. వీసాలు, గ్రీన్ కార్డుల జారీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాకు వచ్చేవారు సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెడితే వారి వీసాలు, గ్రీన్‌కార్డులు మంజూరుచేయబోమని స్పష్టం చేశారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో అనేక మార్పులు వచ్చాయి. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచంలోని పలు దేశాలు ఏదో రకంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. వలసదారుల విషయంలో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలుచేస్తోన్న అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వచ్చేవారు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్‌లు పెడితే వారి వీసాలు, గ్రీన్‌కార్డులు మంజూరుచేయబోమని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు పేర్కొంది. అమెరికా వచ్చే స్టూడెంట్స్‌తో పాటు గ్రీన్‌కార్డ్స్ దరఖాస్తుదారుల సోషల్ మీడియాలపై నిఘా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం. సోషల్ మీడియాలో హమాస్, హెజ్‌బొల్లా, హౌతీల వంటి.. అమెరికా ద్వారా ఉగ్రవాద సంస్థలుగా పరిగణించబడే గ్రూపులకు మద్దతు ఇచ్చే లేదా యూదు వ్యతిరేక ఉద్దేశాలతో కూడిన పోస్టులు పెట్టినట్లు తేలితే, ఆ వ్యక్తులు అమెరికాలో ప్రవేశించడానికి అనర్హులుగా అమెరికా ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రత మరియు యూదు వ్యతిరేకతను అరికట్టడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది.
కాబట్టి అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్, ఇతరులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ వీసా అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. అలా కాదని అమెరికా నిబంధనలను విరుద్ధంగా సోషల్ మీడియాలో ఏవైనా పోస్ట్‌లు పెడితే..అమెరికా వెళ్లాలనే మీ ఆలోచనను మానుకోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
