USA: అయోమయం తీరిందంతే.. భయం అలాగే ఉంది!
సెప్టెంబర్ 20న జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది. జస్ట్ 8 గంటల్లో 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారొకరు. కారణం... ట్రంప్ పెట్టిన టెన్షన్. 21వ తేదీ అర్థరాత్రి 12 గంటల కల్లా అమెరికాలో అడుగుపెట్టాల్సిందేనని కంపెనీయే మెయిల్ చేయడంతో వణికిపోయింది. డెడ్‌లైన్ మిస్ అయితే కోటి కట్టాలి. కట్టకపోతే.. ఇండియాలోనే ఉండిపోవాలి. ఆ క్షణంలో ఆ ఎంప్లాయ్ మెంటల్ కండీషన్ ఎలా ఉందంటే.. 11 ఏళ్లుగా పనిచేస్తున్న కంపెనీ, అక్కడే కట్టుకున్న ఇల్లు, అమెరికా వాతావరణమే అలవాటైన కూతురు... ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా అన్నీ వదిలేసి, ఇండియా వచ్చేసి, మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభించాలా అని తలపట్టుకుందా ఎంప్లాయ్. డెడ్‌లైన్‌కి కొన్ని గంటల ముందు అయోమయాలన్నిటినీ తీర్చేసింది వైట్‌హౌస్. కాని, తీరింది అయోమయం మాత్రమే. భయం అలాగే ఉంది. ఇకపై అమెరికా వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటి? హెచ్1బీ జాబ్ కోసమే అమెరికాలో చదువుతున్న వారి భవిష్యత్ ఏంటి? అమెరికా మార్కెటే ఆధారంగా పుట్టుకొచ్చిన భారత ఐటీ కంపెనీలు, ఐటీ ప్రొఫెషనల్స్ ఏంకావాలిప్పుడు? తెలుగు రాష్ట్రాల ఐటీ ప్రొఫెషనల్స్‌కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ డాలర్ డ్రీమ్స్. వాళ్ల పేరెంట్స్‌కు కూడా. ఇప్పుడా కలలు కల్లలైనట్టేనా?

వైట్‌హౌస్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే.. హెచ్1బీ వీసా అప్లికేషన్‌కు కట్టాల్సిన ఫీజు జస్ట్ వన్‌టైమ్ మాత్రమే. అది యాన్యువల్ ఛార్జ్ కాదు. అంటే.. ఫస్ట్‌టైమ్ ఎవరైతే హెచ్1బీకి అప్లై చేస్తున్నారో వాళ్లకు మాత్రమే కోటి రూపాయల ఫీజు. ప్రస్తుతం ఉన్న హెచ్1బీ హోల్డర్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ లేదు. వీసాల రెన్యువల్స్ అయినా రీ-ఎంట్రీ అయినా … నో ఎక్స్‌ట్రా కాస్ట్. కేవలం కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే ఈ రూల్. అది కూడా ఇప్పటికిప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రావట్లేదు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 తరువాత ఎవరైతే హెచ్1బీతో ఎంటర్ అవుతారో వాళ్లకే కోటి ఫీజు. సో, క్లారిటీ వచ్చేసింది. కాకపోతే.. ఈ కన్‌క్లూజన్ చూశాకే ఇక డాలర్ డ్రీమ్స్ అన్నీ కొట్టుకుపోయాయన్న విషయం అర్థమైంది. పర్టిక్యులర్‌గా తెలుగువాళ్లకి. ఇక అమెరికా ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయినట్టే ఇక. ఆల్‌మోస్ట్ ప్రతి సెక్టార్ వాళ్లకి ఆపర్చునిటీ ఇచ్చేది అమెరికానే. సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్, హాస్పిటల్స్, మెడికల్ రీసెర్చ్, బ్యాంకిగ్, ఇంజనీరింగ్, ఆర్ అండ్ డీ, యూనివర్సిటీస్, రీసెర్చ్.. ఇలా వివిధ సెక్టార్స్‌లో చదువుకున్న వాళ్లకి బిగ్గెస్ట్ డ్రీమ్… అమెరికా. మరి.. అందరూ ఐటీ అనే ఎందుకు కలవరిస్తారంటే, ఆ ఒక్క సెక్టారే హెచ్1బీ వీసాల్లో 65 పర్సెంట్ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి. 2025లో సెక్టార్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే.. సాఫ్ట్‌వేర్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే 65 శాతం హెచ్1బీ...
