US: అమెరికా ప్రయాణం చాలా కష్టం గురూ.. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏకంగా మూడేళ్లకు..

డాలర్‌ సంపాదనే లక్ష్యంగా.. ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది భారతీయులు అమెరికాకు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. దీంతో అన్ని రకాల వీసా ఇంటర్వ్యూల...

US: అమెరికా ప్రయాణం చాలా కష్టం గురూ.. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏకంగా మూడేళ్లకు..
US Visa
Follow us

|

Updated on: Nov 24, 2022 | 6:35 AM

డాలర్‌ సంపాదనే లక్ష్యంగా.. ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది భారతీయులు అమెరికాకు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. దీంతో అన్ని రకాల వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్‌ పీరియడ్‌ పెరుగుతూనే ఉంది. అమెరికా వెళ్లాలనుకుంటే డబ్బులుంటే చాలదు. వెయిటింగ్‌ చేసేంత ఓపిక కూడా ఉండాల్సిందే. మాహా అంటే రెండు నెలలు, మూడు నెలలు అనుకుంటున్నారేమో. అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కోసం మూడేళ్లు నీరిక్షించాల్సిందే. అవును మరి.. అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్‌ కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్‌ లిస్టు ఉంది. అంటే బిజినెస్‌, టూరిస్టు విసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే, వారికి 2025 జూన్‌ లేదా జులైలో విసా అపాయింట్‌మెంటు దొరుకుతుందన్నమాట. భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం పట్టే సమయాన్ని, అమెరికా విదేశాంగశాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్‌లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బందిని బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్‌ చేస్తుంటారు.

భారత్‌లో ఢిల్లీ ఎంబసీతో పాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్ల నుంచి వీసా జారీ సేవలు అందిస్తోంది. ముంబయి ఎంబసీ నుంచి పర్యాటక వీసా బీ1, బీ2 కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ కోసం 999 రోజులు నిరీక్షించాలని అమెరికా అధికారిక వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. అంటే దాదాపు 31 నెలలు వేచి చూడాలి. ఇదే వీసా కోసం హైదరాబాద్‌ నుంచి దరఖాస్తు చేసుకుంటే.. 994 రోజులు, చెన్నై నుంచైతే 948 రోజులు, ఢిల్లీ నుంచి 961 రోజులు, కోల్‌కతా నుంచి 904 రోజుల అపాయింట్‌మెంట్‌ వెయిట్‌ టైం ఉంది. అయితే ఇతర వీసాలకు ఈ వెయిటింగ్‌ లిస్ట్‌ కాస్త తక్కువగానే ఉంది.

హైదరాబాద్‌ నుంచి స్టూడెంట్‌, ఎక్స్చేంజ్‌ వీసాల అపాయింట్‌మెంట్‌ కోసం 374 రోజులు వేచి ఎదురుచూడాల్సి వస్తోంది. పిటిషన్‌ బేస్డ్‌ టెంపరరీ వర్కర్‌ వీసాల అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ టైం 366 రోజులుగా ఉంది. వీసా ఇంటర్వ్యూల సమయం ఎక్కువగా ఉండటంపై అమెరికా రాయబార కార్యాలయం అప్పట్లో స్పందించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో పాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, కేవలం కొత్తగ వీసా పొందేవారికే వెయిటింగ్‌ టైం ఎక్కువగా ఉంటోందని చెప్పింది. అయితే వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు