Car Video: ఏం గుండె ధైర్యం బాసూ.. అతడి డ్రైవింగ్ స్కిల్స్ కు నోరెళ్లబెట్టాల్సిందే..
ప్రమాదాలు చెప్పి రావు.. అప్రమత్తంగా లేకుండే పెను విధ్వంసాన్ని కలిగిస్తుంది. నమ్ముకుని బతుకుతున్న వాళ్లను రోడ్డున పడేస్తుంది. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు అనుక్షణం అలర్ట్ గా ఉండాలి. వెహికిల్ లో వెళ్లినా,...
ప్రమాదాలు చెప్పి రావు.. అప్రమత్తంగా లేకుండే పెను విధ్వంసాన్ని కలిగిస్తుంది. నమ్ముకుని బతుకుతున్న వాళ్లను రోడ్డున పడేస్తుంది. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు అనుక్షణం అలర్ట్ గా ఉండాలి. వెహికిల్ లో వెళ్లినా, బైక్ పై వెళ్లినా.. నడుచుకుంటూ వెళ్తున్నా అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకుంటే పెను ప్రమాదం తప్పదనే విషయాన్ని మర్చిపోవద్దు. సోషల్ మీడియా ఒక భాండాగారం. ఎక్కువ స్టంట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్నింటిని చూస్తే కళ్లు తేలెయాల్సిందే. అతడి డ్రైవింగ్ స్కిల్స్ కు మెచ్చుకోవాలో, తిట్టుకోవాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతారు. ప్రస్తుతం అలాంటి స్టంట్ వీడియో ఒకటి జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఓ కారు డ్రైవర్ హైవేపై వెళ్తున్న రెండు వాహనాల మధ్య నుంచి వెళ్లడాన్ని చూడవచ్చు. కేవలం 8 సెకన్ల ఈ క్లిప్ చూసి.. ఈ కారు డ్రైవర్ ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ ఎలా చేశాడని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
హైవేపై చాలా వాహనాలు అతివేగంతో వెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో మరో కారు హై స్పీడ్ గా రావడాన్ని గమనించవచ్చు. కానీ ఆ తర్వాతి క్షణంలో అందరూ ఊహించనిది జరుగుతుంది. రెండు కార్ల మధ్య నుంచి ఆ కారు వెళ్లేందుకు అవకాశం లేనప్పటికీ ఆ డ్రైవర్ కారుతో డేంజర్ స్టంట్ చేశారు. కారుకు ఉన్న నాలుగు చక్రాల్లో కేవలం రెండు చక్రాలపైనే వెహికిల్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ వీడియో చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కూడా పెను ప్రమాదం జరిగేదే.
Badass ? pic.twitter.com/JJGP06pHDG
— Vicious Videos (@ViciousVideos) November 20, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 45 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారికి షేర్ చేస్తున్నారు.