Diwali 2021: ఈ దేశంలో ఐదురోజులు దీపావళి వేడుకలు.. కాకి, కుక్క, ఎద్దు, ఆవులను పూజించడం ఆచారం..ఎందుకంటే

Nepal Diwali 2021: మన పొరుగు దేశం నేపాల్ లో కూడా దీపావళి పండగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను అక్కడ తీహార్ అని..

Diwali 2021: ఈ దేశంలో ఐదురోజులు దీపావళి వేడుకలు.. కాకి, కుక్క, ఎద్దు, ఆవులను పూజించడం ఆచారం..ఎందుకంటే
Nepal Tihar Festival
Follow us

|

Updated on: Nov 04, 2021 | 9:35 AM

Nepal Diwali 2021: మన పొరుగు దేశం నేపాల్ లో కూడా దీపావళి పండగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను అక్కడ తీహార్ అని పిలుస్తారు. రెండవ ప్రాచుర్యం కలిగిన దీపావళి పండగలో దేవతలతో పాటు.. జంతువులు, పక్షులను పూజిస్తారు. కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులను చాలా పవిత్రంగా భావిస్తారు నేపాలీలు. ఈ సందర్భంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. తీహార్ పండగలో  శ్రీ లక్ష్మి, యమ, గోవర్ధన వంటి దేవతలతో పాటు , కాకులు, కుక్కలు, ఆవులు, ఎద్దుల వంటి జంతువులను కూడా పూజిస్తారు. ఇలా చేయడం తమ జీవితాలకు ఆనందం, విజయం, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నేపాలీలు నమ్మకం.  ఇలా ఈ తీహార్ ను జరుపుకోవడానికి ఒక పురాణాల కథ కూడా ఉంది. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి ఉండదనీ యమధర్మ రాజు వరం ఇచ్చినట్లు నేపాలీల నమ్మకం. అందుకనే అక్కడ దీపావళిని తీహార్ గా ఐదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.

Photo 1

యమ పంచకంలో మొదటి రోజైన కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈరోజున యమధర్మ రాజు  దూతగా భావించే “కాగా” (అంటే కాకి) ని పూజించడం ఆచారం. నేపాలీలు తమ ఇంటి పై కప్పులపై కాకులను ఆహ్వానిస్తూ.. రుచికరమైన ఆహారపదార్ధాలను, స్వీట్స్ ను పెడతారు. కాకులు తమ కుటుంబంలో దురదృష్టం రాకుండా చేస్తాయని .. చేదు నుంచి తమని కాపాడతాయని అక్కడివారి నమ్మకం.

Photo 2

రెండో రోజున కుకుర్ తీహార్ అనగా భైరవుల పండుగ. నేపాల్‌లో కుక్కలను స్వర్గపు ద్వారాల సంరక్షకులుగా భావిస్తారు.  ముఖ్యంగా నల్లని రంగు కుక్కలను  పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, మాంసం, పాలు, గుడ్లు మొదలైన వాటితో పాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తారు.  అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా ఉండి, అతని ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటి ఋణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. అందుకనే ఈరోజున కుక్కలను ఇబ్బంది పెట్టే పనులను నేపాలీలు చేయరు. అంతేకాదు ఈరోజు వీధి కుక్కలను అధికారులు సత్కరిస్తారు.

Photo 4

మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. ఈరోజున హిందువులు పవిత్రంగా భావించే ఆవును  ఆరాధిస్తారు. ఆవుల మెడలో పూలహారాన్ని వేసి.. నుదిటి మీద తిలకంతో అలంకరిస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజిస్తారు. ఇంట్లో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటి ముందు రంగు ఇసుక, ధ్యానం, పువ్వుల సహాయంతో “రంగోలి” ని వేస్తారు.  ఈ సాయంత్రం, పిల్లలు ,యువతులు పొరుగు ఇళ్లకు వెళ్లి, సాంప్రదాయ టిహారా పాటలను పాడతారు. చిన్నవారు తమ కుటుంబంలో పెద్దలనుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.

Photo 3

Photo 3

తీహార్ లోని నాల్గొవ రోజు గోవర్ధన్  వేడుకలను జరుపుకుంటారు. ఈరోజు ఎద్దులను ఆరాధిస్తారు. తమ వ్యవసాయాన్ని ఎంతో సాయం చేస్తున్న ఎద్దులను ఈరోజు పూజించి గౌరవిస్తారు. పూర్తి విశ్రాంతిస్తారు. అంతేకాదు తీహార్లోని నాలుగోరోజు కూడా ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడా స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. ఇక కన్నయ్య భక్తులు ఈ రోజున గోవర్థన పూజ చేస్తారు. దీని కోసం వారు ఆవు పేడ ను పర్వతంగా మలుస్తారు. ఇది ఇంద్రునిపై కృష్ణుడి విజయానికి ప్రతీక. ఈ రోజున, కృష్ణుడిని అన్నకుట్ అనే ఆహారంతో ప్రసన్నం చేసుకోవడం ఆచారం. నేపాల్ క్యాలెండర్ (“నేపాల్ సంబాట్”) ప్రకారం.. కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి నేపాలీలు ప్రారంభమవుతుంది.

Photo 5

యమ పంచకంలో చివరి రోజు ఐదో రోజున భాయ్ టికా పండగను జరుపుకుంటారు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా’ ఇంటికి వెళ్ళి బోజనం చేస్తాడని నేపాలీలు నమ్మకం. రాఖీపండగ తీరునే అన్నచెల్లెల పండగను కూడా జరుపుకుంటారు. సోదరులను చెడు నుండి రక్షించమని, సుఖ సంపదలతో జీవించాలి సోదరీమణులు కోరుకుంటూ జరుపుకునే వేడుక.

ఈ తీహార్ వేడుకల్లో ప్రతి కుటుంబ సభ్యుడు తప్పని సరిగా పాల్గొంటారు. పండుగ సందర్భంగా, ముందుగా కొన్న కొత్త బట్టలను ధరిస్తారు. అల్లం, అనారస్, గులాబ్ జామున్ మరియు కలకంద్ సహా సెలవు వంటకాలు తినడం ఆచారం. బహుమతులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

Also Read:  ఒంగోలులో ఘనంగా జరిగిన నరకాసుర వధ కార్యక్రమం.. భారీగా తరలివచ్చిన భక్తజనం