Deepavali Day Act: అమెరికాలోని ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్‌.. యూఎస్‌లో దీపావ‌ళి రోజు అధికార సెల‌వు.?

Deepavali Day Act: భార‌తీయ సంస్కృతిలో దీపావ‌ళి పండుగ‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భార‌తీయులంతా అత్యంత ఆనందోత్సాహాల‌తో ఈ పండుగ‌ను..

Deepavali Day Act: అమెరికాలోని ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్‌.. యూఎస్‌లో దీపావ‌ళి రోజు అధికార సెల‌వు.?
Deepavali Day Act
Follow us

|

Updated on: Nov 04, 2021 | 8:47 AM

Deepavali Day Act: భార‌తీయ సంస్కృతిలో దీపావ‌ళి పండుగ‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భార‌తీయులంతా అత్యంత ఆనందోత్సాహాల‌తో ఈ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇదిలా ఉంటే భార‌తీయులు ఇత‌ర దేశాల‌కు విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఆయా దేశాల్లోనూ మ‌న పండుగ‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా భార‌తీయులు ఎక్కువ‌గా నివాసం ఉంటున్న అమెరికా లాంటి దేశాల్లో భార‌తీయ సంస్కృతి విస్త‌రిస్తోంది. అంతేకాకుండా అక్క‌డి రాజ‌కీయాల్లోనూ ప్ర‌వాస భార‌తీయులు కీల‌క పాత్ర పోషిస్తుండ‌డంతో భార‌తీయ పండుగ‌ల‌కు ఎక్క‌డ లేని ప్రాముఖ్యత ల‌భిస్తోంది. అగ్ర‌రాజ్యం అమెరికాలోని వైట్ హౌజ్‌లో దీపపావ‌ళి వేడుక‌లు జ‌రుపుతార‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మ‌న‌దీపావ‌ళి పండుగ‌కు మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించ‌నుంది. దీపావ‌ళికి మ‌న దేశంలో ఎలాగైతే సెల‌వు దినంగా ఉందో.. అమెరికాలోనూ ఇక‌పై దీపావ‌ళి రోజున సెల‌వు రోజుగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే అమెరాకా చ‌ట్ట‌స‌భ‌ల్లో దీపావ‌ళి డే బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లుపై చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాత ఆమోద ముద్ర ప‌డితే ఇక‌పై అమెరికాలో దీపావ‌ళి రోజున అధికారికంగా సెల‌వుగా ప్ర‌క‌టిస్తారు. ఇదిలా ఉంటే దీపావ‌ళి రోజున సెల‌వు దినంగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ ఎప్పుటి నుంచో ఉంది. అయితే ఈసారి భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్ అమెరాకి ఉపాధ్య‌క్ష ప‌దవిలో ఉండ‌డంతో క‌చ్చితంగా దీపావ‌ళిని సెల‌వు రోజుగా ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌లకు బ‌లం చేకూరుతోంది.

ఈ విష‌య‌మై అమెరికా కాంగ్రెస్ మ‌హిళా నేత మ‌లోనీ మాట్లాడుతూ.. చీక‌టిపై విజ‌యానికి గుర్తుగాజ‌రుపుకునే దీపావ‌ళిని జ‌రుపుకుంటుండం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది అమెరికా క‌రోనా అనే చీక‌టిపై చేస్తోన్న యుద్ధానికి దీపావ‌ళి చిహ్నంగా మారింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండియ‌న్‌-అమెరిక‌న్ కాంగ్రెస్ మెన్ రాజ కృష్ణ మూర్తి మాట్లాడుతూ..ఈ దీపావ‌ళి పండుగ ప్ర‌పంచ వ్యాప్తంగా వెలుగులు నింపాలంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Diwali 2021: దీపావళీ రోజు స్త్రీలు ఇంట్లోవాళ్లకు ఎందుకు హారతులు ఇస్తారో తెలుసా ?.. స్టోరీ తెలుసుకోండి..

Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..