సెనెగల్ కార్మికుడికి స్పానిష్ రెడ్ క్రాస్ వలంటీర్ హగ్ , సోషల్ మీడియాలో జాత్యహంకారుల ఫైర్, మానవతా ? ఏది నీ చిరునామా అని ప్రశ్నిస్తున్న హ్యుమనిస్టులు
సౌతాఫ్రికా లో దుర్భిక్షం కారణంగా అక్కడి సెనెగల్ నుంచి వేలాది వలస కార్మికులు పొట్ట చేతబట్టుకుని మొరాకో ద్వారా స్పెయిన్ లో ప్రవేశిస్తున్నారు., ఇక్కడైనా తమకు 'పట్టెడన్నం'దొరక్క పోతుందా అన్న గంపెడాశతో వస్తున్నారు....
సౌతాఫ్రికా లో దుర్భిక్షం కారణంగా అక్కడి సెనెగల్ నుంచి వేలాది వలస కార్మికులు పొట్ట చేతబట్టుకుని మొరాకో ద్వారా స్పెయిన్ లో ప్రవేశిస్తున్నారు., ఇక్కడైనా తమకు ‘పట్టెడన్నం’దొరక్క పోతుందా అన్న గంపెడాశతో వస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ కార్మికుడు స్పెయిన్ లోని క్యూటా సిటీలో అడుగు పెట్టగానే రెడ్ క్రాస్ వలంటీర్ ఒకరు అతడిని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆహారం లేక బక్కచిక్కిన అతడికి ల్యునా రేస్ అనే ఆమె మంచినీటిని ఇఛ్చి అతనికి ఊతంగా తన చేతిని అందించింది. ఈ ఆప్యాయతకు కరిగిపోయిన ఆ సెనెగల్ కార్మికుడు ఆనంద భాష్పాలతో ఆమెను హగ్ చేసుకున్నాడు. ఆమెలో తన అక్కనో, చెల్లినో, చివరకు తన తల్లినో చూసుకున్నాడు. సుమారు 8 వేలమంది వలస కార్మికుల్లో ఇతడు కూడా ఒకడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే స్పెయిన్ లోని మితవాద ఫాక్స్ పార్టీ, మరికొందరు చాందసులు ల్యునా రేస్ ని ఈసడించుకున్నారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ ఆమెను దుర్భాషలాడారు. నువ్వు ఓ నల్లజాతీయుడిని హగ్ చేసుకున్నావంటూ ఆమెపై ధ్వజమెత్తారు. అయితే ల్యునా వారికీ బెదరలేదు. ప్రపంచంలో హగ్ అన్నది సహజమైన విషయమని, ఆ కార్మికుడు కన్నీరు పెడుతుంటే తాను సాయంగా చెయ్యి అందించానని 20 ఏళ్ళ ఆమె తెలిపింది. ఆ మాత్రానికే అతడు భావోద్వేగంతో తనను కౌగలించుకున్నాడని ఆమె పేర్కొంది. ఈ హగ్ అతనికి జీవితమంతా లైఫ్ లైన్ లా గుర్తుండిపోతుందని ఆమె వివరించింది. అన్నట్టు అతడిని ల్యునా మళ్ళీ చూడలేదు.
ప్రభుత్వం మొరాకోకు తిప్పిపంపేసిన సుమారు 5,600 మందిలో బహుశా అతడు కూడా ఉండవచ్చునని ఆమె భావిస్తోంది. కానీ ప్రభుత్వంలో కొందరు మంత్రులు మాత్రం ఆమె చర్య పట్ల హర్షం ప్రకటించారు.ఇది మానవతావాదానికి నిదర్శనమని కొంతమంది పేర్కొన్నారు.
Emotiva imagen desde el drama de Ceuta. Una trabajadora de la Cruz Roja se abraza a un exhausto inmigrante pic.twitter.com/aH8JrKYush
— EL MUNDO (@elmundoes) May 18, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో
వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.