Boat Accident: ఘోర దుర్ఘటన.. పడవ మునిగి పది మంది విద్యార్థుల మృత్యువాత..
సౌత్ కంబోడియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మెకాంగ్ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మొత్తం 10 మంది విద్యార్థులు..
సౌత్ కంబోడియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మెకాంగ్ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మొత్తం 10 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయట పడ్డారు. ఓ విద్యార్థి ఆచూకీ ఇంకా లభించలేదని, అతని కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులంతా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులేనని పేర్కొన్నారు.
కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో పరిమితికి మించి ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పడవ బ్యాలెన్సింగ్ కోల్పోయి మునిగిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు లైఫ్ జాకెట్లు సైతం ధరించలేదని చెప్పారు. ఈ ప్రమాదంపై కంబోడియా ప్రధానమంత్రి హున్సేన్ సంతాపం వ్యక్తం చేశారు. వరదల సమయాల్లో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.