AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkish MP: పార్లమెంట్ సాక్షిగా స్మార్ట్‌ ఫోన్‌ను సుత్తితో పగలగొట్టిన ఎంపీ.. కారణమేంటంటే..

చట్ట సభల్లో నిరసన తెలపడం సర్వ సాధారణమైన విషయం. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకుంటారు. కొందరు మౌనంగా నిరసన తెలిపతే మరికొందరు వైలెంట్‌గా రియాక్ట్‌ అవుతారు. తాజాగా ఓ ఎంపీ ఏకంగా సుత్తితో స్మార్ట్ ఫోన్‌ను పగలగొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.?

Turkish MP: పార్లమెంట్ సాక్షిగా స్మార్ట్‌ ఫోన్‌ను సుత్తితో పగలగొట్టిన ఎంపీ.. కారణమేంటంటే..
Turkish Mp Smashes Phone
Narender Vaitla
|

Updated on: Oct 15, 2022 | 8:02 AM

Share

చట్ట సభల్లో నిరసన తెలపడం సర్వ సాధారణమైన విషయం. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకుంటారు. కొందరు మౌనంగా నిరసన తెలిపతే మరికొందరు వైలెంట్‌గా రియాక్ట్‌ అవుతారు. తాజాగా ఓ ఎంపీ ఏకంగా సుత్తితో స్మార్ట్ ఫోన్‌ను పగలగొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? సదరు ఎంపీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

టర్కీలో ఇటీవల తప్పుడు సమాచారం, సామాజిక మాధ్యమాలపై ఓ బిల్లును రూపొందించారు. డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో తప్పుడు సమాచార వ్యాప్తిని నేరంగా పరిగణించడం ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ బిల్లుపై గురువారం పార్లమెంట్‌లో నిర్వహించిన చర్చలో భాగంగా టర్కీ ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్‌ పీపుల్స్‌కి చెందిన ఎంపీ బురాక్‌ ఎర్బే.. తన స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టాడు. ఈ కొత్త బిల్లును టర్కీ చరిత్రలోనే ‘అతిపెద్ద సెన్సార్‌షిప్ చట్టం’గా ఆయన అభివర్ణించారు. సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేయాలనుకోవడం అవివేకమంటూ ఆయన మండి పడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లు తేలితే ఈ చట్టం ద్వారా జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల వినియోగదారులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ బిల్లుపై ఎంపీ బురాక్‌ ఎర్బే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మనకు ఒకే ఒక స్వేచ్ఛ మిగిలి ఉంది. అది మన చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌. సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా ఇతరులతో కమ్యూనికేట్‌ చేయొచ్చు. కానీ ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే ఫోన్‌లను పగలగొట్టడం మినహా చేసేది ఏమి లేదు’ అంటూ తన ఫోన్‌ను పగలగొట్టాడు. ఇదిలా ఉంటే తప్పుడు సమాచారం అన్నదానికి నిర్వచనం లేదని, భావప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ప్రభుత్వ చట్టాలు ఉన్నాయని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..