Iran Protest: ఇరాన్‌లో హిజాబ్ రచ్చ.. మిన్నింటిన నిరసనలు.. పోలీసుల కాల్పుల్లో 30 మందికి పైగా మృతి..
హిజాబ్ వ్యతిరేకంగా ఇరాన్ మహిళల ఆందోళనలు ఉధృతం అయ్యాయి.22-ఏళ్ల మహసా అమిని పోలీస్ కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళా లోకం గళమెత్తి వీధుల్లోకి వచ్చింది.
హిజాబ్ వ్యతిరేకంగా ఇరాన్ మహిళల ఆందోళనలు ఉధృతం అయ్యాయి.22-ఏళ్ల మహసా అమిని పోలీస్ కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళా లోకం గళమెత్తి వీధుల్లోకి వచ్చింది. ముస్లిమ్ సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేసింది.ఈ నిరసనల్లో 30మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత నెల మహసా అమిని ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో ముస్లిమ్ సంప్రదాయ దుస్తువులతో హిజాబ్ సరిగ్గా ధరించలేదనే చిన్న కారణంతో ఆ దేశ మొరాలిటీ పోలీస్ విభాగం కస్టడీలోకి తీసుకుంది. ఆ తరువాత మూడు రోజులు ఆమె కోమాలోకి వెళ్లి చివరకు సెప్టెంబర్ 16న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు.
అమిని మరణంతో మొదలైన హిజాబ్ వ్యతిరేక మహిళా ఉద్యమాలు, పోలీసుల లాఠీచార్జిలు ,అరెస్టులతో ఇరాన్ అట్డుడుకుతోంది. 46 ప్రధాన పట్టణాల్లో ఆందోళనలు ఉధృతం అయ్యాయి,పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..