ఈ కామర్స్ రంగంలోకి టాటా… 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడికి యోచన… ఆ రెండు కంపెనీలతో సంప్రదింపులు…

భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా ఈ కామర్స్ రంగంలో తన పరిధిని విస్తరించుకోవాలని యోచిస్తోంది. ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు పోటీగా ఆన్‌లైన్ మార్కెట్లోకి టాటా ఎంటర్ కావాలని అనుకుంటోంది.

ఈ కామర్స్ రంగంలోకి టాటా... 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడికి యోచన... ఆ రెండు కంపెనీలతో సంప్రదింపులు...

Tatas line up $1.4bn for e-comm play భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా ఈ కామర్స్ రంగంలో తన పరిధిని విస్తరించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ట్రేడింగ్ యాప్స్, కార్స్ 24 వంటి ఆన్‌లైన యాప్స్‌లో పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు పోటీగా ఆన్‌లైన్ మార్కెట్లోకి టాటా ఎంటర్ కావాలని అనుకుంటోంది.

బిగ్ బాస్కెట్, 1 ఎంజీలో పెట్టుబడులు…

ఈ కామర్స్ రంగంలో ప్రవేశ కోసం టాటా గ్రూప్ ఎదురుచూస్తోంది. గత కొంత కాలంగా వివిధ ఈ కామర్స్ సంస్థలతో చర్చలు జరిపింది. తాజా సమాచారం ప్రకారం టాటా బిగ్ బాస్కెట్, 1 ఎంజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు టాటా సుముఖంగా ఉంది. రెండు కంపెనీల్లో దాదాపు 1.4 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో బిగ్‌బాస్కెట్‌లో 70 శాతం వాటా టాటా వశం కానుంది. 1 ఎంజీ లో మేజర్ షేర్ దక్కించుకునేందుకే టాటా యాజమాన్యం ప్రయత్నిస్తోంది.