China – Taiwan: ముదురుతున్న జగడం.. చైనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన తైవాన్.. సరిహద్దు దాటిన డ్రోన్ పేల్చివేత..
షియూ ఐలాండ్‌లోకి చొచ్చుకొచ్చిన సివిలియన్ డ్రోన్‌ను పడగొట్టింది తైవాన్. చైనీస్ కోస్ట్ నుంచి పరిధి దాటి వచ్చిన డ్రోన్‌ను పసిగట్టిన తైవాన్ మిలిటరీ వెంటనే అప్రమత్తమైంది.
China – Taiwan Counter-attacks: జగడం ముదురుతోంది. తైవాన్-డ్రాగన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెచ్చిపోతున్న చైనాకు గట్టిగా గుణపాఠం చెబుతోంది తైవాన్. తమ ఎయిర్‌స్పేస్‌లోకి దూసుకొచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన తైపీ.. డ్రాగన్‌కు గట్టి హెచ్చరికల్ని పంపింది. షియూ ఐలాండ్‌లోకి చొచ్చుకొచ్చిన సివిలియన్ డ్రోన్‌ను పడగొట్టింది తైవాన్. చైనీస్ కోస్ట్ నుంచి పరిధి దాటి వచ్చిన డ్రోన్‌ను పసిగట్టిన తైవాన్ మిలిటరీ వెంటనే అప్రమత్తమైంది. డ్రోన్‌పై ఫోకస్ పెట్టిన మిలిటరీ.. నేలకూల్చింది. దీనిని గుర్తు తెలియని డ్రోన్‌గా చెబుతోంది తైవాన్. చైనా వైపు నుంచే రావడంతో డ్రాగన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై మండిపడుతోంది చైనా. అటు తైవాన్‌తో పాటు అమెరికాపైనా కన్నెర్ర చేస్తోంది డ్రాగన్ దేశం. చైనా ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా తైవాన్‌లో పర్యటించారు పెలోసీ. అప్పటి నుంచీ తైవాన్‌ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది చైనా. మిలిటరీ విన్యాసాలతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా చైనీస్ కోస్ట్ నుంచి తైవాన్ పరిధిలోకి డ్రోన్ చొచ్చుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ క్రమంలో అమెరికా కూడా.. చైనా చర్యలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే.. సహించేది లేదంటూ ఇప్పటికే పలు హెచ్చరికలు చేసింది. ఇప్పటికే సముద్ర తీరంలో నౌకలను కూడా మోహరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..