Dawood Ibrahim: దావుద్ ఇబ్రహీం సమాచారం ఇస్తే భారీ రివార్డు.. ప్రకటించిన NIA
ముంబయి పేలుళ్ల సూత్రధాని, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ-NIA భారీ రివార్డు ప్రకటించింది. దావుద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే..

Dawood Ibrahim: ముంబయి పేలుళ్ల సూత్రధాని, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ-NIA భారీ రివార్డు ప్రకటించింది. దావుద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది. దావుద్ ఇబ్రహీంతో పాటు అతడి అనుచరులు చోటా షకీల్ పై రూ.20 లక్షలు, హజి అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావెద్ పటేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తక్ అబ్దుల్ రజాక్ మేమన్ అలియాస్ టైగర్ మెమన్ పై రూ.15 లక్షల చొప్పున రివార్డును NIA ప్రకటించింది. 1993 ముంబర్ వరుస పేలుళ్ల ఘటనలో నిందితుల కోసం NIA ఎప్పటినుంచో గాలిస్తోంది. అయితే వీరి ఆచూకీ లభించలేదు. దీంతో వీరిని అరెస్టు చేసేందుకు వీలుగా ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని NIA కోరింది.
ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రిజం అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, మనీ లాండరింగ్, ఉగ్రవాద సంస్థకు నిధుల మంజూరు వంటి నేరాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో అంతర్జాతీయ ఉగ్ర ముఠా ‘డి’ కంపెనీపై NIA ఈఏడాది ఫిబ్రదిరలో కేసు కూడా నమోదు చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్ర సంస్థలకు ‘డి’ కంపెనీ కీలక సమాచారం అందిస్తూ వస్తోంది. దీంతో ఈసంస్థపై కేసు నమోదు చేసింది NIA. దావుద్ ఇబ్రహీంను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నాడని అధికారికంగా వెల్లడించింది. ముంబైలో 1993లో జరిగిన వరుస బాంబు పేలుళంల ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..