Viral News: ఎంత పొరపాటు జరిగింది.. ఆరేళ్లుగా వ్యక్తితో డేటింగ్‌లో ఉన్న మహిళ.. చివరికి అతనెవరో తెలిసేసరికి..
Viral News: జీవితం చాలా విచిత్రమైంది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. లైఫ్‌లో కొన్ని నిజాలు తెలిసిన తర్వాత కాళ్ల కింద భూమి కంపించినంత పని అవుతుంది. ఏటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ జీవితంలో ఇలాంటి ఓ సంఘటనే జరిగింది...
Viral News: జీవితం చాలా విచిత్రమైంది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. లైఫ్‌లో కొన్ని నిజాలు తెలిసిన తర్వాత కాళ్ల కింద భూమి కంపించినంత పని అవుతుంది. ఏటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ జీవితంలో ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. రెడిట్ అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఆమె స్టోరీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. 30 ఏళ్ల ఓ మహిళ గడిచిన ఆరేళ్లుగా 32 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. వీరు శారీరకంగా కూడా ఒకటయ్యారు. అయితే తాజాగా సదరు వ్యక్తి తన బయోలాజికల్ బ్రదర్ అని తెలియడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఇంతకీ ఇంతటి తప్పిదం ఎలా జరిగింది.? సొంత సోదరుడితో రిలేషన్‌లో ఎలా ఉంది.? లాంటి విషయాలను నెటిజన్లతో రెడిట్ పోస్ట్‌లో పంచుకుంది. అసలు కథ ఏంటో ఆమె మాటల్లోనే..
‘నేను గత ఆరేళ్లుగా తన బ్రదర్‌తోనే డేటింగ్‌లో ఉన్నను. ఈ విషయం టైప్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు నాకు తెలియకుండానే అతన్ని నా బాయ్‌ఫ్రెండ్‌గా ప్రస్తావించాను. చదువుకునే రోజల్లో మా ఇద్దరినీ వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ తర్వాత మాకెప్పుడు కలుసుకునే అవకాశం లేదు. పెద్దయ్యాక అనుకోకుండా మా మధ్య ఏర్పడిన బంధం ప్రేమంగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకొని సహజీవనం చేయడం ప్రారంభించాం. ఈ క్రమంలోనే మా పూర్వీకులు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు కాను డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా నిజం తెలిసింది. అయితే ఈ విషయాన్ని నేను అతనికి చెప్పలేకపోయాను’ అని రాసుకొచ్చింది.
అతనితో జీవితాన్ని సంతోషంగా గడుపుతోన్న తరుణంలో ఈ విషయం ఆమెకు మింగుపడడం లేదు. అసలు ఆ విషయం నిజమేనా క్రాస్‌చెక్ చేసుకోవడానికి మరోసారి పరీక్షలు చేయించుకోవాలని డిసైడ్ అయ్యింది. అయితే సదరు యువకుడితోనే తన జీవితం అంటోందా మహిళ. బహుశా ఈ విషయం తన బాయ్ ఫ్రెండ్‌కి తెలియకూడదని కాబోలు తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..