AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: మాతృభూమి కోసం తీవ్రమైన పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ పౌరులు.. పెట్రో బాంబులతో

ఉక్రెయిన్‌పైకి దూసుకొస్తున్నాయి రష్యన్‌ దళాలు. రోజురోజుకూ దాడిని తీవ్రం చేస్తున్నాయి. దీంతో తమ దేశాన్ని కాపాడుకోవడానికి కీలక చర్యలకు దిగారు ఉక్రెయిన్‌ వాసులు.

Russia-Ukraine War: మాతృభూమి కోసం తీవ్రమైన పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ పౌరులు.. పెట్రో బాంబులతో
Molotov Cocktails
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2022 | 9:34 PM

Share

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని ప్రధాన న‌గ‌రాల‌పై దాడుల‌ను తీవ్రం చేస్తోంది ర‌ష్యన్‌ ఆర్మీ. కీవ్‌, ఖార్కీవ్ ప్రాంతాల్లో బాంబు దాడుల‌ను పెంచింది. ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ కార్యాల‌యాలు, టీవీ ట‌వ‌ర్‌, పోలీస్ బిల్డింగ్‌పై బాంబు దాడులు చేస్తున్నాయి ర‌ష్యా సేన‌లు. ఈ దాడుల‌కు దీటుగా బ‌దులిచ్చేందుకు గట్టిగానే ప్రయ‌త్నిస్తోంది ఉక్రెయిన్. కానీ రష్యా బలగాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు ఉక్రెయిన్‌ సైనికులు. దీంతో రంగంలోకి దిగారు అక్కడి పౌరులు. ర‌ష్యాను ప్రతిఘటించ‌డానికి పెట్రో బాంబుల‌ను వాడాల‌ని నిర్ణయించుకున్నారు ఉక్రెయిన్‌ ప్రజలు. ఈ పెట్రో బాంబుల ద్వారా ర‌ష్యాను ఎదుర్కొంటామ‌ని, కీవ్ ప్రాంతాన్ని కాపాడుకుంటామ‌ని స్పష్టం చేస్తున్నారు పౌరులు. కీవ్ ప్రాంతానికి ర‌క్షణగా తాము ఉంటామ‌ని, పెట్రో బాంబులతో ర‌ష్యాకు బ‌దులిస్తామ‌ని అంటున్నారు ఉక్రెయిన్‌ సిటిజన్స్‌. తాము యుద్ధానికి ఏమాత్రం భ‌య‌ప‌డ‌టం లేద‌ని, త‌మ మాతృభూమి కోసం పోరుడుతున్నామ‌ని అంటున్నారు. తామేమీ ర‌ష్యాకు భ‌య‌ప‌డ‌టం లేదని, మేము కూడా మంచి పోరాట యోధుల‌మే అని స్పష్టం చేస్తున్నారు. మోలటోవ్‌ మాక్‌టెయిల్‌ అంటే హోమ్ మేడ్ పెట్రోల్ బాంబులతో అలెర్ట్‌గా ఉన్నారు ఉక్రెయిన్ పౌరులు. అలర్లు జరిగినప్పుడు ఉపయోగించే వీటిని ఇప్పుడు రష్యా సైన్యంపై వాడండి అంటూ ప్రజలకు సూచించింది యుక్రెయిన్‌ రక్షణశాఖ. వాటిని ఎలా తయారు చేయాలో కూడా పౌరులకు వివరించింది. దీంతో ఇంట్లో ఉన్న పాతసీసాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటికే పెట్రో బాంబులను సిద్ధం చేశారు. ఆ బాంబులనే రష్యా సైన్యంపైకి విసిరి.. సొంత గడ్డ కోసం పోరాడుతున్నారు.

ఇప్పటికే, రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి, అక్కడి పౌరులకు ఆయుధాలు ఇచ్చింది ఉక్రెయిన్‌ ప్రభుత్వం. అంతేకాకుండా, ఆ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్‌ సెలబ్రెటీలు. తాము యుద్ధంగా పాల్గొంటామని, దేశాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ పెట్రో బాంబులతో రష్యాకు చెక్‌ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్‌ పౌరులు.

Also Read: Russia-Ukraine War: రష్యా దాడుల బీభత్సం… కాలినడకన ఉక్రెయిన్‌ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరో!