AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: రష్యా దాడుల బీభత్సం… కాలినడకన ఉక్రెయిన్‌ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరో!

రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఎటు చూడు కన్నీటి దృశ్యాలే. ఈ క్రమంలోనే  యుద్దాన్ని ఆపాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కీవ్‌ను కబళించడమే లక్ష్యంగా రష్యా కవాతు చేస్తోంది.

Russia-Ukraine War: రష్యా దాడుల బీభత్సం... కాలినడకన ఉక్రెయిన్‌ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరో!
Sean Penn
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2022 | 7:57 PM

Share

రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఎటు చూడు కన్నీటి దృశ్యాలే. ఈ క్రమంలోనే  యుద్దాన్ని ఆపాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కీవ్‌ను కబళించడమే లక్ష్యంగా రష్యా కవాతు చేస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం అందర్నీ కలిచి వేస్తోంది. రష్యా ఆగడాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తానంటూ హాలీవుడ్‌ స్టార్‌ హీరో, డైరెక్టర్‌ ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీను కలిశారు. ఉక్రెయిన్‌ సేనలతో కూడా మాట్లాడారు.  ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను డాక్యుమెంటరీ రూపొందించడానికి సిద్ధమైన సీన్‌ పెన్‌.. సంక్షోభ పరిస్థితులపై జెలెన్‌స్కీ కొన్ని వీడియోలు కూడా రికార్డ్‌ చేశారు. కానీ భగ్గుమన్న వార్‌ సీన్‌తో అక్కడ ఉండటం సురక్షితం కాదని వెనక్కి మళ్లారు.  ధైర్యంగా వార్‌ గ్రౌండ్‌లోకి వచ్చిన స్టార్‌ హీరో, డైరెక్టర్‌.. ఇలా పీచే ముడ్‌ అనడం వెనుక కారణాలేంటి?… రావడానికి రీజనేంటో తనే ట్వీట్‌ చేశారు. వెళ్లే టైమ్‌లో ట్వీట్‌కు ఫోటో జత పరిచారు. కారణాలు ఇంకేముంటాయి. బతికి వుంటే బలుసాకు తినొచ్చు.. డాక్యుమెంటరీలు సినిమాలు తీసుకోవచ్చు.

వాస్తవానికి ఉక్రెయిన్‌లో సిట్చుయేషన్‌ అలా వుంది. ఎంతో మంది ప్రాణభయంతో బోర్డర్‌ బాట పడుతున్నారు. స్టార్‌ హీరో అయినా భయం భయమే కదా. అందరిలా సీన్‌ పెన్‌ కూడా మౌనంగా సరిహద్దు దాటారు. అదీ ఇలా కాలినడకన. డాక్యుమెంటరీ తీయడానికి వచ్చి బహుదూరపు బాటసారిలా ఉక్రెయిన్‌ బోర్డర్‌ను క్రాస్‌ చేశారు సీన్‌ పెన్‌. వలస వెళ్తున్న వారి దైన్యాన్ని ట్వీట్‌ చేశారు.  “మా కారును రోడ్డు పక్కన వదిలేసి నేను, నా ఇద్దరు కొలీగ్స్‌ మైళ్ల దూరం నడుచుకుంటూ పాలిష్‌(పోలాండ్‌) బోర్డర్‌కు చేరుకున్నాం. ఈ ఫొటోలో కన్పిస్తోన్న అన్ని కార్లలో మహిళలు, చిన్నారులే ఉన్నారు. వారితో ఎలాంటి లగేజీ లేదు. కేవలం కారు మాత్రమే వారి వెంట ఉన్న ఏకైక ఆస్తి” అనేది ట్వీట్‌ సారాంశం. డాక్యుమెంటరీ సంగతి ఎలా వున్నా.. ప్రజల దైన్యాన్ని ట్వీట్‌ ద్వారా కళ్లకు కట్టారాయన.

Hollywood Hero

జెల్‌న్‌ స్కీ… సీన్‌ పెన్‌.. స్టార్‌డమ్‌లో ఇద్దరూ ఇద్దరే. కాకపోతే రియల్‌ లైఫ్‌లో డిఫెరెన్స్‌ ఏంటో చూస్తున్నారుగా. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా కదనరంగాన అసలు సిసలు కథా నాయకుడిగా జెలెన్‌ స్కీ రష్యాను ఎదుర్కొంటున్నాడు. స్టార్‌ హీరో సీన్‌ పెన్‌.. సీనేంటో కళ్ల ముందుంది. రీల్‌కు రియల్‌కు ఎంత డిఫరెన్స్‌.

Also Read: Viral: ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు..నెత్తిమీదే మంట పెట్టి.. పొంగల్‌ వండేస్తున్నారు..!