AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy: విహారంలో విషాదం.. భారీగా మంచు వర్షం.. కార్లలోనే ఇరుక్కుపోయి 16 మంది దుర్మరణం..

సంతోషంగా గడపడానికి వెళ్లారు. మంచు అందాలను ఆస్వాదించాలనుకున్నారు. కానీ అదే యమపాశమైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ప్రాణాలు తీసింది మంచు.

Tragedy: విహారంలో విషాదం.. భారీగా మంచు వర్షం.. కార్లలోనే ఇరుక్కుపోయి 16 మంది దుర్మరణం..
Tourists Death
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2022 | 9:25 PM

Share

కొండప్రాంతాల్లో, మంచు కురిసే వేళలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వెళ్లారు. కానీ ఆ టూర్‌ వారిని కానరాని లోకాలకు తీసుకెళ్తుందని ఊహించలేదు పర్యాటకులు. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని 16 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఇస్లామాబాద్​కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అందుకే శీతాకాలంలో మంచు అందాలను ఆస్వాదించేందుకు వేల సంఖ్యలో వస్తుంటారు పర్యాటకులు. అయితే, ఈ ప్రాంతంలో ఇటీవల ఉష్ణోగ్రతలు మైనస్​ 8 డిగ్రీలకు పడిపోయాయి. మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలో కార్లలోనే ఇరుక్కుపోయారు పలువురు పర్యాటకులు. కార్లు మొత్తం మంచుతో నిండిపోయాయి కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి 16 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చనిపోయిన వారిలో ఇస్లామాబాద్​కు చెందిన పోలీస్ అధికారి కూడా ఉన్నారు. మరో విషాదం ఏంటంటే, మృతిచెందిన 16 మందిలో 8 మంది ఆ పోలీస్​ అధికారి బంధువులే. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే వేల వాహనాలను మంచులోంచి బయటకు తీశామని. ఇంకా కొన్ని తీస్తున్నామని తెలిపారు స్థానిక మంత్రి షేక్ రషీద్ అహ్మద్​. ఒక్కరాత్రిలోనే ముర్రీ ప్రాంతాన్ని 4 అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసిందని చెప్పారు మంత్రి. ఈ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు అధికారులు. ఇంకా వాహనాల్లో ఇరుక్కున్న మరికొంతమందికి ఆహారం, దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

Also Read: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

Follow Us
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!