పనిమనిషిని టార్చర్ పెట్టి హతమార్చిన సింగపూర్ మహిళ…..30 ఏళ్ళ జైలు శిక్ష
బర్మాకు చెందిన యువతిని తన ఇంట్లో పనికి పెట్టుకున్న యజమానురాలు ఆమెను చిత్రవధకు గురి చేసి చివరకు హతమార్చినందుకు కోర్టు ఆ యజమానురాలికి 30 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
బర్మాకు చెందిన యువతిని తన ఇంట్లో పనికి పెట్టుకున్న యజమానురాలు ఆమెను చిత్రవధకు గురి చేసి చివరకు హతమార్చినందుకు కోర్టు ఆ యజమానురాలికి 30 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 24 ఏళ్ళ పియాంగ్ గై డాన్ అనే యువతిని 14 నెలల పాటు కొట్టి..తిట్టి..వేధించి ఆమెను హతమార్చిన గాయత్రి మురుగాయన్ అనే ఈ మహిళపై 28 కి పైగా అభియోగాలు నమోదయ్యాయి. 2016 లో జరిగిన ఈ హింసాత్మక ఘటనపై ఇన్నేళ్ళుగా కోర్టులో కేసు నడిచింది. 40 ఏళ్ళ మురుగాయన్ కి మానసిక సమస్యలు ఉన్నప్పటికీ ఆమె కావాలనే తమ ఇంటి పనిమనిషి పట్ల హింసకు పాల్పడిందని కోర్టు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. పియాంగ్ మరణానికి ఈమె కారకురాలని తాము నమ్ముతున్నామన్నారు.,మురుగాయన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈ విషయాన్ని స్ఫష్టం చేస్తున్నాయన్నారు. తమ క్లయింటుకు విధించిన జైలుశిక్షను 15 లేదా 16 ఏళ్లకు తగ్గించాలని, దానివల్ల జైలు నుంచి విడుదల అయ్యాక ఆమె తన పిల్లలతో గడపగలుగుతుందని మురుగాయన్ తరఫు లాయర్ కోర్టును కోరారు. (సింగపూర్ లో ఈ ఘటన దేశవ్యాప్త సంచలనమైంది.0
అప్పీలు దాఖలు చేయడానికి అనుమతించాలని ఆ లాయర్ కోరారు. . 30 ఏళ్ళ శిక్ష అంటే యావజ్జీవ శిక్ష కన్నా దారుణమని ఆయన అన్నాడు. అయితే జడ్జి ఇందుకు నిరాకరించారు. పేద ఆసియా దేశాల నుంచి ఏటా దాదాపు రెండున్నర లక్షల మంది మహిళలు ఇళ్లలో పనులు చేయడానికో, ఇంటి యజమానుల పిల్లలను చూసుకోవడానికో సంపన్న దేశాలకు వెళ్తుంటారు. అయితే వీరిలో చాలామంది ఇలా యజమానుల లేదా యజమానురాళ్ల వేధింపులకు గురవుతుంటారు. ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఈ పోకడ కనిపిస్తుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Potina Venkata Mahesh : ‘ఈ డ్రామాలు ఏంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారూ.. వాటిపై మీకు రాజకీయం తగునా?’ : జనసేన ప్రతినిధి పోతిన
Acharya: అంతుబట్టని ‘ఆచార్య’ మూమెంట్స్.. రిలీజ్ డేట్‌పై మెగాఫ్యాన్స్‌ని వెంటాడుతున్న సందేహాలు !