తనకు ఇష్టమైన కారును ప్రధాని మోదీకి ఇచ్చిన చైనా అధ్యక్షులు జిన్‌పింగ్.. ప్రత్యేకతలేంటంటే?
చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక కారును బహుమతిగా ఇచ్చింది. ఈ కారు 'హాంగ్కీ L-5', దీనిని చైనాలో 'రెడ్ ఫ్లాగ్' అని కూడా పిలుస్తారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు అత్యంత ఇష్టమైన కారు. అంతేకాదు ఆయన ఉపయోగించే కారు కూడా ఇదే..!

చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక కారును బహుమతిగా ఇచ్చింది. ఈ కారు ‘హాంగ్కీ L-5’, దీనిని చైనాలో ‘రెడ్ ఫ్లాగ్’ అని కూడా పిలుస్తారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు అత్యంత ఇష్టమైన కారు. అంతేకాదు ఆయన ఉపయోగించే కారు కూడా ఇదే..!
ఈ కారును చైనాలో ‘మేడ్ ఇన్ చైనా’కి చిహ్నంగా పరిగణిస్తారు. దీని చరిత్ర 1958లో ప్రారంభమైంది. ఇది ప్రత్యేకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకుల కోసం తయారు చేయడం జరిగింది. ఈ కారును చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని FAW (ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్) తయారు చేసింది. 2019లో భారతదేశంలోని మహాబలిపురంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా ఈ కారును ఉపయోగించారు.
ఇదిలావుంటే, ఆదివారం (ఆగస్టు 31) జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రధానమంత్రి మోదీతో కీలక చర్చలు జరిపారు. రెండు దేశాలు కలిసి స్నేహితులుగా మారడం ఇప్పుడు అవసరమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో తన సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ, జి జిన్‌పింగ్‌తో అన్నారు. రెండు దేశాల మధ్య 2.8 బిలియన్ల సహకారం పౌరుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.
సరిహద్దులో ఇప్పుడు శాంతి, స్థిరత్వ వాతావరణం ఉంది. రెండు దేశాల సైనికులు తమ భూభాగానికి తిరిగి వచ్చారని ప్రధాని మోదీ ఒక ప్రసంగంలో అన్నారు. ట్రంప్ సుంకాల వివాదం కారణంగా ఏర్పడిన అశాంతి తర్వాత రెండు దేశాల నాయకుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ‘మా సహకారం రెండు దేశాల 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలకు సంబంధించినది. ఇది దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మార్గం తెరుస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఇదిలావుంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యేక అధ్యక్ష కారు ‘ఆరస్’లో టియాంజిన్ నగరంలో ప్రయాణించారు. ఈ కారులో చైనా దౌత్య నంబర్ ప్లేట్ ఉంది. ఆరస్ అనేది ఆరస్ మోటార్స్ అనే రష్యన్ కంపెనీ తయారు చేసిన రెట్రో-స్టైల్ లగ్జరీ కారు. ఈ కారు రష్యా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆధునిక సాంకేతికతతో పాటు రాయల్ లుక్‌ను ఇస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
