AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: భారీ భూకంపం.. 9 మంది మృతి.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి పరుగులు.. భయం గుప్పిట్లో జనాలు!

Earthquake: భూకంపం తర్వాత ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 12.47 గంటలకు భూకంపం సంభవించింది. మొదట 6.0 తీవ్రతతో, ఆ తర్వాత 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రజారోగ్య విభాగం ప్రతినిధి నకిబుల్లా రహీమి తెలిపారు. భూకంపం..

Earthquake: భారీ భూకంపం.. 9 మంది మృతి.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి పరుగులు.. భయం గుప్పిట్లో జనాలు!
Subhash Goud
|

Updated on: Sep 01, 2025 | 7:35 AM

Share

దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం కారణంగా 9 మంది మృతి చెందగా, 25 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారత దేశంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు.

జలాలాబాద్‌కు ఈశాన్యంగా 27 కి.మీ (16.77 మైళ్ళు) దూరంలో నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని 8 కి.మీ (4.97 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని USGS నివేదించింది. USGS నమూనాలు ఈ భూకంపం వల్ల వందలాది మంది మరణించవచ్చని అంచనా వేస్తున్నాయి.

భూకంపం తర్వాత ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 12.47 గంటలకు భూకంపం సంభవించింది. మొదట 6.0 తీవ్రతతో, ఆ తర్వాత 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రజారోగ్య విభాగం ప్రతినిధి నకిబుల్లా రహీమి తెలిపారు. భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ భూకంపం వల్ల చాలా ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భారీ నష్టం సంభవించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..