బెన్ను గ్రహశకలం నమూనాల గుట్టు విప్పుతున్నారు.. ఆ రోజున లైవ్ స్ట్రీమింగ్
ఓసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ సాయంతో బెన్ను గ్రహశకలం నుంచి దుమ్ము, గులకరాళ్ల నమునాలను నాసా ఈ మధ్య భూమిపైకి తీసుకొచ్చింది. అయితే తాజాగా సైంటిస్టులు వాటి రహస్యాలను తెలుసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఓసిరిస్ రెక్స్ ఏవియానిక్స్ డెక్‌లో నల్లటి దుమ్ము, శిథిలాలు ఉన్నట్లు నిర్థారించుకున్నారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత నమునాలను తీసుకొచ్చిన పరికరంపై ఉన్నటువంటి ప్రాథమిక మూతను తొలగించామని నాసా వెల్లడించింది.

ఓసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ సాయంతో బెన్ను గ్రహశకలం నుంచి దుమ్ము, గులకరాళ్ల నమునాలను నాసా ఈ మధ్య భూమిపైకి తీసుకొచ్చింది. అయితే తాజాగా సైంటిస్టులు వాటి రహస్యాలను తెలుసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఓసిరిస్ రెక్స్ ఏవియానిక్స్ డెక్‌లో నల్లటి దుమ్ము, శిథిలాలు ఉన్నట్లు నిర్థారించుకున్నారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత నమునాలను తీసుకొచ్చిన పరికరంపై ఉన్నటువంటి ప్రాథమిక మూతను తొలగించామని నాసా వెల్లడించింది. అయితే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఆదివారం రోజున యూటా అనే ఎడారిలో ల్యాండ్ అయ్యింది. అయితే దానిని హ్యూస్టన్‌లోని నాసాకు చెందినటువంటి జాన్సన్ అనే స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. శకలాల నమూనాలు, అలాగే వాటిని సురక్షితంగా భద్రపరచగలిగే.. నిపుణుల బృందం కూడా ఇక్కడ ఉంది. అయితే క్యాప్సుల్స్ నుంచి టచ్ అండ్ గో శాంపిల్ అక్విజిషన్ మెకానిజాన్ని విడదీయడానికి పరిశోధకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అంతేకాదు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ల్యాబ్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు ఆ అల్యూమినియం మూతను తీసేశామని నాసా తెలిపింది. అలాగే ట్యాగ్‌సమ్‌ను క్యాన్‌స్టర్ నుంచి పూర్తిగా విడదీసిన తర్వాత దాన్ని ఓ స్టీల్ ట్రాన్స్‌ఫర్ కంటైనర్‌లోకి మార్చుతారు. దీనివల్ల నమూనాలను వేరు చేసేటటువంటి వేరు చేసే ప్రక్రియ అనేది వేగంగా పూర్తి అవుతుంది. అయితే దీన్ని పూర్తి చేయడానికి శాస్త్రవేత్తలు, టెక్నికల్ నిపుణులు కొన్ని నెలల పాటు సాధన చేశారు. అయితే ఈ బెన్ను గ్రహశకలం నుంచి తీసుకొచ్చినటువంటి నమునాలను అక్టోబర్ 11వ తేదిన బయట ఉన్న ప్రపంచానికైతే చూపించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ దృష్టిని నాసా వైబ్‌సైట్‌లో లైవ్ ప్రసారం చేయనుంది.
మరోవైపు 2016లో నాసా ‘ఓసిరిస్- రెక్స్ (OSIRIS-REx)’ అనే మిషన్‌ను కూడా ప్రయోగించింది. అయితే 2020 సంవత్సరంలో అది బెన్ను గ్రహశకలం ఉపరితలం నుంచి దుమ్ము, రాళ్లను సేకరించింది. ఆ తర్వాత భూమి వైపుగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ క్రమంలోనే భూమికి లక్ష కిలోమీటర్ల దూరంలో వ్యోమనౌక నుంచి విడిపోయినటువంటి క్యాప్స్యూల్.. నాలుగు గంటల అనంతరం భూమిని చేరుకుంటుంది. అయితే అగ్రదేశానికి చెందినటువంటి నాసా సంస్థ.. ఓ గ్రహశకలం నమునాలను సేకరించి.. వాటిని భూమిపైకి తీసుకురావడం ఇదే మొట్టమొదటి సారి. అయితే ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు జపాన్ దేశం మాత్రమే ఇలా గ్రహశకలానికి చెందినటువంటి నమూనాలను భూమి మీదకు విజయవంతంగా తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు నాసా తీసుకొచ్చిన ఆ గ్రహశకలం నమూనాలు ఎటువంటి గుట్టు విప్పుతాయో ఆసక్తి నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.