భూగ్రహ వాతావరణంలో పెను మార్పులు.. పరిధి దాటిపోతున్న కాలుష్యంపై రీసెర్చర్ల ఆందోళన
భూగ్రహ వాతావరణంలో పెరిగిపోతున్న శబ్ద, వాయు కాలుష్యాల వల్ల పెను మార్పులు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా అమెరికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగి వీచిన వడగాడ్పులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని రీసెర్చర్లు పేర్కొన్నారు.
భూగ్రహ వాతావరణంలో పెరిగిపోతున్న శబ్ద, వాయు కాలుష్యాల వల్ల పెను మార్పులు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా అమెరికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగి వీచిన వడగాడ్పులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని రీసెర్చర్లు పేర్కొన్నారు. క్లైమేట్ చేంజ్ మనం ఊహించినదానికన్నా వేగంగా మారుతూ పరిధి దాటి పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మన గ్రహం మీది ఈ మార్పులపై మేల్కొనకపోతే వినాశనం తప్పదన్నట్టు హెచ్చరించారు. గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్ సెంట్రేషన్, ఓషన్ ఎసిడిఫికేషన్ వంటి 16 కీలక పర్యావరణ సంబంధ అంశాలు ఈ ముప్పును చెప్పకనే చెబుతున్నాయని ఇప్పటికే ఈ భూగ్రహం వేడెక్కి పోతోందని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం రీఫిల్ తమ అధ్యయన బృందంతో కలిసి రూపొందించిన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. అమెజాన్ ఆడవుల్లో భారీ వర్షాలు, అమెరికాలోని కాలిఫోర్నియా వంటి చోట్ల రేగిన కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనాలు…పశ్చిమ అంటార్కిటికా , గ్రీన్ ల్యాండ్ ఐస్ షీట్స్ వంటివి మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలని వీరు వివరించారు.
కరోనా పాండమిక్ కారణంగా వాయు, వాహన, కార్బన్ డై ఆక్షైడ్ వంటి కాలుష్యాలు తగ్గినప్పటికీ 2020 సంవత్సరం అతి ఉష్ణోగ్రతలను నమోదు చేసిన సంవత్సరంగా గడిచిందని వీరు పేర్కొన్నారు. వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ కి చెందిన పరిశోధకులు కూడా వీరి వాదనలతో ఏకీభవించారు. ఆ ఏడాది గ్లోబల్ టెంపరేచరర్లు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగిపోయాయన్నారు.గత ఏప్రిల్లో కార్బన్ డై ఆక్సైడ్ కాన్సెంట్రేషన్ అత్యధికంగా పెరిగిపోయిందన్నారు. 2019 లో వీరు రూపొందించిన అధ్యయన పత్రంపై 158 దేశాలకు చెందిన 14 వేలమంది శాస్త్రజ్ఞులు సంతకాలు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Biker Granny: స్పోర్ట్స్ బైక్ పై రయ్యి రయ్యిన దూసుకుపోతున్న బామ్మ.. నెట్టింట్లో వీడియో వైరల్