బీజింగ్ లో ఇసుక తుపాను , రెండు వారాల్లో మళ్ళీ రెండో సారి., ట్రాఫిక్ అస్తవ్యస్తం
చైనా రాజధాని బీజింగ్ ఇసుక తుపానుతో అల్లాడుతోంది. కేవలం రెండు వారాల్లో రెండోసారి ఇసుక ఈ నగరాన్ని కమ్మేసింది. ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తోంది.
చైనా రాజధాని బీజింగ్ ఇసుక తుపానుతో అల్లాడుతోంది. కేవలం రెండు వారాల్లో రెండోసారి ఇసుక ఈ నగరాన్ని కమ్మేసింది. ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తోంది. కరువుతో సతమతమవుతున్న మంగోలియా, వాయువ్య చైనా నుంచి వీస్తున్న పెనుగాలులకు తోడు ఈ ఇసుక కూడా కొట్టుకు వస్తోందని అంటున్నారు. కట్టడాలు, భవనాలు కూడా కనిపించనంతగా అన్నింటినీ ఇసుక కమ్ముతోంది. వాహనదారులు, పాదచారుల కష్టాలు చెప్పనలవికాదు . కళ్ళలో ఇసుక పడకుండా వారు నానా పాట్లు పడుతున్నారు. ప్రతి నెలా దాదాపు ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంటుందని స్థానికులు కొందరు చెప్పారు. కానీ ఇంతటి బీభత్సాన్ని మాత్రం తాము ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. ఆదివారం ఉదయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 స్థాయికి చేరుకుంది. కొన్ని జిల్లాల్లో క్యూబిక్ మీటరుకు ఇసుక పరమాణువులు పీ ఎం10 కి మించి 2 వేల మైక్రోగ్రాములకు చేరాయట . చైనా వాతావరణ శాఖ శుక్రవారం నాడే ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది. మంగోలియా నుంచి నార్తర్న్ చైనాలోకి ఈ తుపాను ప్రవేశించిందని తెలిపింది. అననుకూల వాతావరణం కారణంగా ఏప్రిల్ లో కూడా బీజింగ్ ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోవచ్చునని హెచ్చరించింది. ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొంది.
చైనా వాసులు ఈ అనుకోని ఉత్పాతంతో భయాందోళన చెందుతున్నారు. ఇసుక తుపానులు సాధారణంగా ఇక్కడ కొత్త కాకపోయినా ఇంతటి తీవ్రంగా రావడం వారిని బెంబేలెత్తిస్తోంది.
Beijing was enveloped in thick dust carrying high levels of hazardous particles as a second sandstorm in two weeks hit the city due to winds from Mongolia and northwestern China. Read more https://t.co/e1JRErl9MO pic.twitter.com/ZvPlkUK9rr
— Reuters India (@ReutersIndia) March 28, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: Holi 2021: ఈ హోలీ రోజున మీ ఇంట్లోనే సులభంగా ఈ స్నాక్స్ తయారు చేసుకొండిలా.. మరింత రుచిగా..