AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ నాశనానికి రష్యా బ్రహ్మాస్త్రం.. వాక్యూమ్ బాంబ్ అంటే ఏమిటి?

Vacuum Bomb: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో నేటికి ఎడో రోజు. ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలన్నీ రష్యా అధ్యక్షుడు వ్వాదిమిర్ పుతిన్‌ను కోరుతున్నా ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడానికి ఆయన సిద్ధంగా లేరు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ నాశనానికి రష్యా బ్రహ్మాస్త్రం.. వాక్యూమ్ బాంబ్ అంటే ఏమిటి?
Vacuum Bomb
Balaraju Goud
|

Updated on: Mar 02, 2022 | 4:08 PM

Share

Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో నేటికి ఎడో రోజు. ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలన్నీ రష్యా అధ్యక్షుడు(Russia President) వ్వాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)ను కోరుతున్నా ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ రోజు రష్యా సైన్యం ఉక్రెయిన్‌(Ukraine)లోని సైనిక స్థావరంపై దాడి చేయడం 70 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కైవ్ దాడి సమయంలో రష్యా వాక్యూమ్ బాంబ్ అని కూడా పిలువబడే థర్మోబారిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అమెరికాలోని రష్యా రాయబారి ఒక్సానా మార్కోవా మీడియాలో ఒక ప్రకటన చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ హక్కుల సంఘాలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రష్యా వాక్యూమ్ బాంబులు, క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌పై ఉపయోగించిందని ఆరోపించాయి.

రష్యా నిజంగా వాక్యూమ్ బాంబులను ఉపయోగించిందా?, ఈ రోజు వాక్యూమ్ బాంబులను ఉపయోగించినట్లు చట్టసభ సభ్యులతో జరిగిన సమావేశంలో అమెరికాలోని రష్యా రాయబారి ఒక్సానా మార్కోవా చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఉక్రెయిన్ వాదనలు ఇంకా ధృవీకరించలేదు. ఇది నిజమైతే బహుశా అది యుద్ధ నేరమేనని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

వాక్యూమ్ బాంబు అంటే ఏమిటి వాక్యూమ్ బాంబ్ అనేది థర్మోబారిక్ ఆయుధం, ఇది అధిక ఉష్ణోగ్రత పేలుడును ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది సాధారణంగా సంప్రదాయ పేలుడు పదార్థం కంటే చాలా ఎక్కువ శ్రేణిలో పేలుడు తరంగాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది మానవ శరీరాన్ని ఆవిరి చేయగలదు. ఈ బన్ను మూడు వందల మీటర్ల వ్యాసార్థంలో నష్టాన్ని కలిగించగలదు. ఈ బాంబును ఏరోసోల్ బాంబు అని కూడా అంటారు. సాధారణ పేలుడు పదార్థాల కంటే వాక్యూమ్ బాంబుల పేలుడు తరంగం చాలా ఎక్కువ కాలం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అణుబాంబు ఎంత ప్రమాదకరమో , ఈ బాంబును ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని కూడా అంటారు. ఇది అణు బాంబు వంటి వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ షాక్‌వెబ్‌తో పేలుతుంది. అది మరింత విధ్వంసం కలిగిస్తుంది. ఈ బాంబు ఇతర సాంప్రదాయ ఆయుధాల కంటే శక్తివంతమైనదిగా పరిగణించబడటానికి ఇదే కారణం. అంతర్జాతీయ మానవతా చట్టం క్లస్టర్ ఆయుధాలను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నిషేధిస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. పౌరులను చంపే లేదా గాయపరిచే విచక్షణారహిత దాడులు యుద్ధ నేరం. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లోని సీనియర్ విశ్లేషకుడు డాక్టర్ మార్కస్ హెలియర్ మాట్లాడుతూ, వాక్యూమ్ బాంబులు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేదా ఇతర భవనంపై చాలా విధ్వంసక ఆయుధంగా ఉంటాయని చెప్పారు.