Russia Ukraine War: రష్యా విమానం కూల్చివేత.. పైలెట్‌ను బంధించిన ఉక్రెయిన్ దళాలు
Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఓ వైపు ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోవైపు.. రష్యా బలగాలు(Russian military).. ఉక్రెయిన్ లో దాడులు..
Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఓ వైపు ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోవైపు.. రష్యా బలగాలు(Russian military).. ఉక్రెయిన్ లో దాడులు చేస్తూనే ఉన్నాయి. అయితే రష్యా బలగాలను ఉక్రెయిన్ వాసులు కూడా అడ్డుకుంటున్నారు. కదన రంగంలోకి జవాన్లకు తోడుగా సామాన్యులు, సెలబ్రెటీలు కూడా దిగుతున్నారు. సామాన్య పౌరుల స్థావరాలపైనా రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ పై రష్యా గగనతలం నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ నిపుణులు ఓ రష్యా విమానాన్ని కూల్చివేశారు. ఈ ఘటన చెర్నివ్ నగర శివార్లలో జరిగింది. అంతేకాదు, ఉక్రెయిన్ బలగాలు ఆ విమాన పైలెట్ ను బందీగా పట్టుకున్నట్టు తెలుస్తోంది.
UPD❗ Щойно на околицях Чернігова фахівці ППО збили ще один ворожий штурмовик! pic.twitter.com/D3yiff8uyr
— Defence of Ukraine (@DefenceU) March 5, 2022
ఆ విమాన కోపైలెట్ మేజర్ క్రివలాపోవ్ మరణించినట్టు కథనాలు వెలువడ్డాయి. కూలిపోతున్న విమానం నుంచి పైలెట్ బయటికి దూకేయడాన్ని (కాక్ పిట్ ఎజెక్షన్) ఓ వీడియో ద్వారా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ పైలెట్ ను బందీగా పట్టుకున్న దళాలు, అతడిని క్రాస్నోయార్ త్సెవ్ గా గుర్తించాయి. అటు, చెర్నివ్ నగరంపై రష్యా వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో మరణించినట్టు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఇప్పటివరకు 22 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ప్రాంతీయ గవర్నర్ ఈ దాడులపై స్పందిస్తూ, రెండు పాఠశాలలు, కొన్ని నివాస గృహాలపై వైమానిక దాడులు జరిగాయని వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
Also Read: