AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: అప్పుడు అలా.. ఇప్పుడిలా.. విదేశాల్లోని భారతీయుల తీరు ఇదే..

రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్య భారతీయ విద్యార్థలను భారత్‌కు తీసుకొచ్చారు. అయితే ఓ బాంబుల వర్షం కురుస్తున్నా..

Russia Ukraine War: అప్పుడు అలా.. ఇప్పుడిలా.. విదేశాల్లోని భారతీయుల తీరు ఇదే..
Indian Students
Sanjay Kasula
|

Updated on: Mar 06, 2022 | 3:43 PM

Share

గర్జిస్తూ తరుముకొస్తున్న ఫిరంగులు ఒకవైపు.. గడ్డ కట్టే చలి మరోవైపు. క్షణ క్షణం భయం.. భయం.. బోర్డర్ వరకూ వచ్చిన వాళ్లు.. సేఫ్‌గా స్వదేశానికి ల్యాండ్ అవుతున్నారు. రష్యా(Russia) దాడి తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్య భారతీయ విద్యార్థలను భారత్‌కు తీసుకొచ్చారు. “ఆపరేషన్ గంగా”(Operation Ganga) పేరుతో తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది భారత ప్రభుత్వం(indian government). ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థుల తరలింపు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రధాని మోదీ.. ఆపరేషన్‌ గంగా కోసం వాయుసేనను కూడా రంగంలోకి దించారు.. తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకువచ్చేందుకు సీ-17 విమానాన్ని ఉపయోగించనుంది వాయుసేన. స్వదేశానికి చేరుకున్న విద్యార్థుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌ గగనతలం మీద పౌర విమానాలు తిరిగే అవకాశం లేకపోవడంతో భారతీయ విద్యార్థులకు ఆదేశ సరిహద్దు వరకు రోడ్డు మార్గం ద్వారా రప్పించారు.. పొరుగు ఉన్న హంగేరి, రోమేనియా, పోలాండ్, స్లోవేకియా, మాల్టోవా దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తున్నారు.. ఇందుకోసం ఆయా దేశాలల్లోని భారత రాయబార కార్యాలయాలు నిరంతరం పని చేస్తున్నాయి..

ఓ వైపు ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించామని కేంద్రం సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. భారతీయుల తరలింపు కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను ప్రశంసించింది. అయితే యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం తన ప్రణాళికపై ప్రతిపక్షలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరో అడుగు ముందుకేసిన రాహుల్ గాంధీ మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ వివరాలు చేరాలని పేర్కొన్నారు.

ఇక మరో వైపు “ఆపరేషన్ గంగా” పేరుతో భారత ప్రభుత్వం తరలింపు విజయవంతంగా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు కొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇన్ని ఇబ్బందులు పడేవాళ్లం కాదు. మేం ఇప్పుడు ఇక్కడికి చేరుకొన్నాం.. కాబట్టి మీరు పువ్వులతో స్వాగతం పలుకుతున్నారు. రాకపోయి ఉంటే ఏం చేసేవారు? మా కుటుంబాలు ఏం అయిపోయేవి? ఈ పువ్వులను ఏం చేసుకోవాలి? దేనికి పనికివస్తాయి? సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకుండా, మేం వచ్చిన తర్వాత పువ్వులతో స్వాగతం చెప్పడం ఏంటి? కేంద్రంపై బీహార్‌ విద్యార్థి దివ్యాంశు సింగ్‌ ఆగ్రహం చేశాడు.

మనం విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకువచ్చినప్పటి నుండి దేశం మనకు రుణపడి ఉంటుందని మనం భ్రమించుకోమని కొందరు విదేశాల్లో ఉండే భారతీయులు అంటారు. మన కోసం, మన కుటుంబాల సంక్షేమం, ఆస్తిలో పెట్టుబడుల కోసం విదేశీ మారకద్రవ్యాన్ని పంపుతారు. మనలో ఎవ్వరూ ఉదయాన్నే లేచి ‘నేను భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం పంపబోతున్నాను’ అని చెప్పరు.

భారత్‌తో అనుబంధం

నిజానికి ఇలా చెప్పుకుంటూ పోతే.. మనకు మాతృదేశానికి మధ్య తరచుగా స్వయం చోదకత్వంతో కూడిన అనుబంధం ఇంకా శక్తివంతంగానే ఉంది.. దానితో ఎలాంటి సమస్య లేదు. హీట్ పెరిగే వరకు ఎందుకు వేచి ఉండాలి? న్యూస్ పేపర్లో వచ్చే వార్తలు చదవలేదా?  వారి పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోలేదు..? అయితే.. సమస్య పెరిగే వరకు అక్కడే ఉండే కంటే ముందు వారు స్వంత ఖర్చులతో వచ్చి ఉంటే సరిపోయేదిగా అంటూ అని చాలా మంది విమర్శలకు ప్రశ్నిస్తున్నారు. తీరా ప్రభుత్వం స్వంత ఖర్చులతో తీసుకొచ్చిన తర్వాత అసహనం ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం అంటూ అడుగుతున్నారు. బాంబులు పడటం మొదలు పెట్టగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కైవ్‌లోని ఈ భారతీయ రాయబార కార్యాలయం చేపట్టిన కార్యక్రమాన్నితప్పకుండా మెచ్చుకుని తీరాలి.. ఇలాంటి సమయంలో నిందలు వేయడం ఎంతవరకు సరైనది అంటు అడుగుతున్నారు. ప్రతి తరలింపుదారు విమానంలో ప్రయాణించడానికి రూ. 120,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులెవరూ ట్యాబ్ తీసుకోమని అడగడం లేదు.

రెస్క్యూ స్పియర్‌హెడ్

దూసుకొస్తున్న మిస్సైల్స్.. వెంటాడుతున్నయుద్ధ ట్యాంకుల మధ్య.. క్షణమొక యుగంలా ఇండియన్స్ గడిపారు. తల్లిదండ్రులను చూస్తామో లేదో.. మాతృభూమికి చేరుకుంటామో లేదో అనే టెన్షన్ వాళ్లది. భయపడకండి అంటూ.. ఆపరేషన్ గంగతో అభయహస్తం ఇచ్చింది కేంద్రం. శరవేగంగా భారతీయులను తరలిస్తోంది. సరిహద్దు దేశాల సహకారంతో సక్సెస్‌ఫుల్‌గా మిషన్ చేపడుతోంది.  అయితే భారత్ దేశం మాత్రం తమ పౌరులను తరలించే పనిని చేపట్టినా.. చాలా రోజుల తర్వాత చైనా, అమెరికా వంటి పెద్ద దేశాలు ముందుకు వచ్చాయి. నిజానికి, ప్రభుత్వం చేయాల్సింది IAF C17లను వెంటనే సేవలో పెట్టడమే. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి  ఆహార సేవ అవసరం లేదు. ఒక C17 సమీపంలో 500 మంది వ్యక్తులను లోడ్ చేయగలదు. ఇది కరేబియన్‌కు వెళ్లే క్రూయిజ్ ఫ్లైట్ కాదు.

బదులుగా, షెడ్యూల్ చేయబడిన క్యారియర్‌ల నుండి చాలా ఎక్కువ నారో బాడీ 737లు, A320లు సహ-ఆప్ట్ చేయబడటంతో మంచి ఉద్దేశాలు చాలా వికృతంగా ఉన్నాయి. C17ని తీసుకురావడం తెలివైన పని. దాదాపు 13,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పుడు సగం మంది ఇంట్లోనే ఉన్నారు.

ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులకు ఆపరేషన్‌ గంగా బాధ్యతలు అప్పగించింది కేంద్రం. వీకే సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, హర్దిప్ సింగ్‌లు ఉక్రెయిన్ పక్క దేశాలకు వెళ్లి మన వారిని రప్పిస్తున్నారు. ఎంపిక చేసిన సెంటర్స్‌లో టెంపరరీ ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. మన వారిని ఇండియాకు తీసుకువస్తున్నారు.

ఉక్రెయిన్​లో ఇంకా మిగిలి ఉన్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఆదివారం కీలక సూచనలు జారీ చేసింది. పేరు, ఉక్రెయిన్​లోని ఏ నగరంలో ఉన్నారు? అనే తదితర అంశాలతో అందుబాటులో ఉంచిన ఓ దరఖాస్తును అత్యవసర ప్రాతిపదికన నింపాలంటూ సూచించింది. ఈ మేరకు గూగుల్​ డ్యాక్యుమెంట్​ను జతపరిచింది.

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్​ గంగ చివరి దశకు చేరుకుంది. ఈరోజు చివరి విమానం వెళ్లనున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రాయబార కార్యాలయం కల్పించిన సౌకర్యాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో సొంత ఖర్చులతో నివసిస్తున్న విద్యార్థులు.. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రానికి 10-12 గంటల మధ్య వెంటనే చేరుకోవాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: Chicken Price: బాబోయ్‌.. ఈ చికెన్ చిక్కనంటోంది.. కోడి ధర తగ్గనంటోంది.. కారణం ఇదే!

Russia Ukraine War: మహిళా పైలెట్లతో పుతిన్ సమావేశం.. ఉక్రెయిన్‌పై యుద్ధంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..