AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: పుతిన్‌ – జెలెన్‌స్కీ సేనల హోరాహోరీ ఫైట్‌.. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు!

16 రోజులుగా ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతూనే ఉంది. పుతిన్‌ - జెలెన్‌స్కీ సేనల మధ్య హోరాహోరీ ఫైట్‌ సాగుతోంది. సామాన్య పౌరులే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నాయి రష్యన్‌ బలగాలు.

Russia Ukraine War: పుతిన్‌ - జెలెన్‌స్కీ సేనల హోరాహోరీ ఫైట్‌.. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు!
Russia Ukraine War
Balaraju Goud
|

Updated on: Mar 11, 2022 | 9:56 AM

Share

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతూనే ఉంది. పుతిన్‌(Putin) – జెలెన్‌స్కీ(Zelensky) సేనల మధ్య హోరాహోరీ ఫైట్‌ సాగుతోంది. సామాన్య పౌరులే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నాయి రష్యన్‌ బలగాలు. 16 రోజులుగా యుద్ధం సాగుతున్నా కీవ్‌ను హస్తగతం చేసుకోలేకపోయింది రష్యా. ప్రస్తుతం కీవ్‌కు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న పుతిన్ సేన..కీవ్‌ వైపు దూసుకొస్తోంది. ఇక నిన్న ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. విదేశాంగమంత్రులు టర్కీలో సమావేశమయ్యారు. ఆ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. యుద్ధం విరమించడానికి రష్యా సిద్ధంగా లేదని..తాము లొంగిపోవాలన్నదే పుతిన్‌ ఉద్దేశమన్నారు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో. కానీ తాము తగ్గే ప్రసక్తే లేదంటున్నారు.

మరోవైపు రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరియుపోల్‌లో ఆస్పత్రులపైనా దాడులు చేశాయి రష్యన్‌ బలగాలు. మరియుపోల్‌లో ప్రజలు తిండి, నీరు లేక అలమటించిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 1300మంది పౌరులు చనిపోయారని ప్రకటించింది ఉక్రెయిన్‌. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ యుద్ధం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంఘర్షణకు ముగింపు పలకాలని కోరుకుంటున్నానని, తాను ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని అన్నారు. లావ్‌రోవ్‌ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ TASS ఈ విషయాన్ని వెల్లడించింది.

ఉక్రెయిన్‌పై తమ దేశం చేసిన దాడికి ఎదురుదెబ్బ తగులుతుందని, ఆర్థిక ఆంక్షల కారణంగా తమ ప్రజలు తనను ద్వేషిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా నేతలకు చెప్పారు. “యుద్ధ నేరంలో ప్రమేయం ఉన్నందుకు రష్యన్లు ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయబడతారు” అని వోలోడిమిర్ జెలెన్‌స్కీ గురువారం ఒక వీడియోలో తెలిపారు. దాడి కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయని, దీని పర్యవసానాలను రష్యా ప్రజలందరూ అనుభవిస్తారని చెప్పారు. రష్యా పౌరులు చాలా సంవత్సరాలుగా ప్రతిరోజూ మోసగిస్తున్న రష్యా నాయకులను ద్వేషిస్తారని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, కాల్పుల విరమణపై మాస్కో – కీవ్ అగ్ర దౌత్యవేత్తల మధ్య చర్చలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా గురువారం టర్కీలో మానవతా కారిడార్లు మరియు కాల్పుల విరమణపై రష్యా కౌంటర్ సెర్గీ లావ్‌రోవ్‌తో జరిగిన సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. రష్యాకు ఇతర డిమాండ్లు ఉన్నాయని, ఇందుకు ఉన్నతస్థాయి అధికారులతో సవారిని సంప్రదించాల్సిన అవసరం ఉందని కులేబా చెప్పారు. యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నాలను కొనసాగించాలని లావ్‌రోవ్‌తో తాను అంగీకరించినట్లు ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో సిద్ధంగా లేదని ఆయన అన్నారు. వారు ఉక్రెయిన్ లొంగిపోవాలని కోరుకుంటున్నారు. అది జరగదని స్పష్టం చేశారు.