Russia Ukraine War: రాజధాని కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా దళాలు.. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ హస్తగతం!

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య వార్‌ పీక్స్‌కు చేరింది. ఈ టైంలో సెన్సెషనల్‌ కామెంట్స్‌ చేశారు పుతిన్‌. దీనిపై ఫైర్‌ అవుతోంది ఉక్రెయిన్‌. మరోవైపు, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై విరుచుకుపడ్డాయి రష్యా దళాలు.

Russia Ukraine War: రాజధాని కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా దళాలు.. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ హస్తగతం!
Kyiv City
Follow us

|

Updated on: Feb 26, 2022 | 9:20 AM

Russia Ukraine Conflicts: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య వార్‌ పీక్స్‌కు చేరింది. ఈ టైంలో సెన్సెషనల్‌ కామెంట్స్‌ చేశారు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin). దీనిపై ఫైర్‌ అవుతోంది ఉక్రెయిన్‌. మరోవైపు, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌(Kyiv)పై విరుచుకుపడ్డాయి రష్యా దళాలు. యుద్ధ ట్యాంకర్లు నగరాన్ని చుట్టుముట్టగా, గెరిల్లా దళాలతో రష్యా ఆర్మీ(Russian Army) దాడులు నిర్వహించింది. భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇప్పటికే కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఆక్రమించుకున్నాయి రష్యా దళాలు. ఈ సమయంలో రష్యా చీఫ్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక కామెంట్స్‌ చేశారు.

ఉక్రెయిన్‌లో పాలనను చేతిల్లోకి తీసుకోండని, ఉక్రెయిన్‌ సైన్యానికి పిలుపునిచ్చారు పుతిన్. నాజీల ఆధిపత్యం నుంచి ఉక్రెయిన్‌ ఆర్మీ బయటకు రావాలని సూచించారు. ఉక్రెయిన్‌ ఆర్మీతో చర్చలకు సిద్ధమని ప్రకటించారాయన. పౌరులకు ఉక్రెయిన్‌ తుపాకులు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు పుతిన్. తాము దాడులు చేస్తే పౌరులను చంపామంటూ, మమ్మల్ని దోషిగా చూపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రష్యా చీఫ్. ఇది అమెరికా పన్నిన పన్నాగం అని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. అయితే, ప్రతిఘటన ఆపి, ఆయుధాలు పక్కనపెడితేనే చర్చలంటూ ప్రకటించిన రష్యా, గంటల వ్యవధిలోనే మాట మార్చింది.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపొద్దంటూ స్వరం మార్చాడు పుతిన్‌. పూర్తిగా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి తగ్గొద్దంటూ కీలక సూచన చేశాడు. అయితే, చర్చల దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయని, యుద్ధం ముగియొచ్చని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడి విజ్ఞప్తిని లెక్కచేయకుండా, దాడులు ముమ్మరం చేయాలని పుతిన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈయూ ఆంక్షలు, ఆస్తుల్ని సీజ్‌ చేయడం, అమెరికా సైబర్‌ దాడులు, నాటో దళాల కీలక సమావేశం, ఇలా ఒకదానివెంట ఒకటి వేగంగా జరిగాయి. దీంతో పుతిన్‌ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అటు తమ బలగాలు ధీటుగానే పోరాడుతున్నట్లు చెబుతోంది ఉక్రెయిన్‌.