Russia Ukraine War: యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చిన రష్యా.. వారి కోసం ఐదు గంటల పాటు కాల్పల విరామం

Russia Ukraine War: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య భీకరపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదో రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా (Russia) కీలక..

Russia Ukraine War: యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చిన రష్యా.. వారి కోసం ఐదు గంటల పాటు కాల్పల విరామం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 05, 2022 | 12:43 PM

Russia Ukraine War: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య భీకరపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదో రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా (Russia) కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ (Ukraine)లో కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది రష్యా. విదేశీయుల తరలింపు విషయంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఐదున్నర గంటల పాటు తాత్కాలిక విరామం ప్రకటించింది రష్యా. అయితే పది రోజుల యుద్ధం తర్వాత రష్యా విదేశీ పౌరుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకరపోరు కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇతర దేశాల వారు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోవడంతో నానా అవస్థలకు గురయ్యారు. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో రష్యా ఈ తాత్కాలిక కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది. నగరాల నుంచి పౌరులు బయటకు వెళ్లేందుకు వీలుగా యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చింది.

అలాగే ఉక్రెయిన్‌లో భారతీయులతో పాటు ఇతర దేశాల వారు ఎందరో విద్యార్థులు, పౌరులు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారి తరలింపులో భాగంగా ఆపరేషన్‌ గంగా కొనసాగుతోంది. ఇక ఐక్యరాజ్యసమితిలో మాస్కో రాయబారి (Moscow Ambassador) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో విదేశీయులు బందీలుగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఖార్కివ్‌లో భారతీయులు (Indians) 3,189 మంది ఉండగా, వియత్నామీస్‌-2700, ఖార్కివ్‌ (Kharkiv)లో బందీలుగా 202 మంది చైనీయులు, సుమీలో భారతీయులు 576 మంది, ఘనా-101, చైనీయులు 121, చెర్నిహివ్‌లో బందీలుగా 9 మంది ఇండోనేషియన్లు ఉన్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: మిస్సైల్స్‌ కలకలం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌ను వీడని ఏపీ యువకుడు.. అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు.. కారణం తెలిస్తే షాకవుతారు