Russia-Ukraine: ఐరాసలో మాస్కో రాయబారి కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో 3,189 మంది భారతీయులు

Russia Ukraine War: ఐక్యరాజ్యసమితిలో మాస్కో రాయబారి (Moscow Ambassador) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో విదేశీయులు బందీలుగా ఉన్నట్లు ప్రకటించారు...

Russia-Ukraine: ఐరాసలో మాస్కో రాయబారి కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో 3,189 మంది భారతీయులు
Follow us

|

Updated on: Mar 05, 2022 | 9:58 AM

Russia Ukraine War: ఐక్యరాజ్యసమితిలో మాస్కో రాయబారి (Moscow Ambassador) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ జాతీయవాదుల చేతిలో విదేశీయులు బందీలుగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఖార్కివ్‌లో భారతీయులు (Indians) 3,189 మంది ఉండగా, వియత్నామీస్‌-2700, ఖార్కివ్‌ (Kharkiv)లో బందీలుగా 202 మంది చైనీయులు, సుమీలో భారతీయులు 576 మంది, ఘనా-101, చైనీయులు 121, చెర్నిహివ్‌లో బందీలుగా 9 మంది ఇండోనేషియన్లు.

కొనసాగుతున్న ఆపరేషన్‌ గంగా

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారి తరలింపులో భాగంగా ఆపరేషన్‌ గంగా కొనసాగుతోంది. 24 గంటల్లో మూడు సీ-17 విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి. పోలాండ్‌, రొమేనియా, స్లోవేకియా నుంచి 629 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకోనున్నారు.

జెలెన్‌స్కీ భద్రత కోసం స్పెషల్‌ ఫోర్స్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తన హత్యకు రష్యా కుట్ర చేస్తోందని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. నాలుగు సార్లు హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు గుప్పించారు. తను క్వీవ్‌లోనే ఉన్నట్లు ప్రకటించారు జెలెన్‌స్కీ. జెలెన్‌స్కీ ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌ శకలాలు గుర్తించడం కలకలం రేపుతోంది. జెలెన్‌స్కీ పోలాండ్‌ వెళ్లినట్లు రష్యా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జెలెన్‌స్కీ భద్రత కోసం స్పెషల్‌ ఫోర్స్‌ ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: మిస్సైల్స్‌ కలకలం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్‌..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌ను వీడని ఏపీ యువకుడు.. అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు.. కారణం తెలిస్తే షాకవుతారు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు