Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భీకర పోరు.. కీవ్ తర్వాత పుతిన్ నెక్స్ట్ టార్గెట్ ఖర్కీవ్..
కీవ్ తరువాత అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నోవా కఖోవ్‌కాల్లోకి కూడా రష్యా బలగాలు ప్రవేశించాయి. ఖర్కీవ్.. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం.
ఉక్రెయిన్‌లో(Ukraine) భీకర పోరు..సై అంటే సై..డీ అంటే ఢీ..ఎస్..ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతోంది రష్యా(Russia). నాలుగో రోజు దాడి మరింత ఉధృతమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను(kiev) చుట్టుముట్టాయి రష్యన్ బలగాలు. ప్రెసిడెన్షియల్ బిల్డింగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నాయి. గెరిల్లా సైన్యాన్ని దింపింది రష్యా. అయితే రష్యన్ ఆర్మీని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర కొనసాగుతోంది. కీవ్ తరువాత అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌ను (kharkiv city ) రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నోవా కఖోవ్‌కాల్లోకి కూడా రష్యా బలగాలు ప్రవేశించాయి. ఖర్కీవ్.. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం. సోవియట్ సమయం నుంచి ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రంగా ఖర్కీవ్ నిలిచింది.
ఇక్కడ చాలా భారీ పరిశ్రమలు ఉన్నాయి. . ప్రపంచ వ్యాప్తంగా హెవీ పవర్ ఎక్వీప్‌మెంట్ నిర్మాణంలో 17శాతం వాటా ఈ కంపెనీలకు ఉంది. ప్రపంచంలో విమానాలను సొంతగా నిర్మించగల అతికొద్ది దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. ఇక్కడి యాంటినోవ్ సంస్థ వివిధ అవసరాలకు వాడుకొనే రవాణా విమానాలను తయారు చేస్తుంది.
దీనికి సంబంధించిన కీలక ప్లాంట్ ఒకటి ఖర్కీవ్‌లో ఉంది. భారత్ కూడా యాంటినోవ్ విమానాలను వాడుకుంటోంది. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఐటీ హబ్‌ల్లో ఖర్కీవ్ ఒకటి. ఇక్కడ దాదాపు 500 కంపెనీల్లో 25వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవండి..