Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: పిచ్చి పట్టిందా..? పుతిన్‌ నిర్ణయంపై నాటో దేశాల ఆందోళన..

పుతిన్‌కి పిచ్చిలేసింది. మెంటల్‌ పట్టింది. లేకపోతేగాని.. అణుబాంబులను సిద్ధం చేయడమేంటి? ఇప్పటికే ప్రపంచం చూసింది చాలు. ప్రజలు కోల్పోయింది చాలు. ఇప్పుడీ కిమ్‌ చేష్టలు అవసరమా?

Russia Ukraine War: పిచ్చి పట్టిందా..? పుతిన్‌ నిర్ణయంపై నాటో దేశాల ఆందోళన..
Russia President Putin
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 28, 2022 | 2:25 PM

ఉక్రెయిన్‌(Ukraine) కేంద్రంగా చాలా పెద్ద యుద్ధాన్నే మొదలుపెట్టాడు రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin). మొదట ఉక్రెయిన్‌లో చిన్నభాగమైన డాన్‌బాస్‌ కోసమేనని ప్రారంభించిన ఈ మారణహోమాన్ని(war) రోజురోజుకు మరో లెవెల్‌కి తీసుకెళుతున్నాడు. ఉక్రెయిన్‌పై పెత్తనం కోసం.. వారి అధ్యక్షుడిని తుదముట్టించడం కోసం.. తనకు నచ్చిన ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం పుతిన్‌ చేస్తున్న యుద్ధమిది. కాని నాలుగు రోజుల మారణహోమం తర్వాత తెలిసింది ఏంటంటే.. ఇది కేవలం ఉక్రెయిన్‌కి బెదిరించడం కోసం కాదు.. ప్రపంచాన్ని శాశించడం కోసం. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం. నాటో దేశాలకు క్లియర్‌ వార్నింగ్‌ ఇవ్వడం కోసం ఈ యుద్ధాన్ని చేస్తున్నాడు.

నాటో దేశాలు ఇప్పటివరకు కూడా చాలా సంయమనాన్ని పాటించాయి. పాటిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఒక్క సైనికుడిని కూడా దించలేదు. బాధిత దేశానికి మానసిక స్థైర్యాన్ని కల్పించడమే తప్ప.. మరో అడుగు ముందుకేయలేదు. అదే సమయంలో రష్యాపై వరుస ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ప్రపంచం నుంచి ఏకాకిని చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేశాయి నాటో కంట్రీస్‌. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కూలుతోంది. బ్యాంకులకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఆ బ్యాంకులు దివాళా తీసే దిశగా వెళుతున్నాయి. కంపెనీలు మూతపడేలా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు కూడా వెనక్కిపోయే ప్రమాదం పొంచిఉంది.

ఈ వరుస ఆంక్షలు.. ఆర్థిక పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో పుతిన్‌ వెనక్కి తగ్గుతాడులే అని నాటో దేశాలు భావించాయి. కాని… కాని.. జరుగుతోంది వేరు. తన ఆర్మీకి మరో వార్‌ సైరన్‌ వినిపించాడు పుతిన్‌. అణ్వాయుధాలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చాడు. నాటో దేశాల ఓవరాక్షన్‌ తట్టుకోలేకపోతున్నామని ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రష్యా అణ్వాయుధాలు సిద్ధం చేస్తోందంటే.. మ్యాటర్‌ సీరియస్‌గానే తీసుకోవాలి. ఎందుకంటే.. రష్యా ఏకకాలంలో ఒక్కో నాటోదేశంపై వంద అణుబాంబులను ప్రయోగించగలదు. భూమి మీదనుంచి.. ఆకాశమార్గం గుండా.. సముద్ర జలాల మీదుగా ఈ అణుబాంబులు దూసుకెళ్లగలవు.

ఈ ఒక్క పిలుపుతో పుతిన్‌కి నిజంగానే మైండ్‌ పోయింది అంటున్నాయి నాటో కంట్రీస్‌. తామెంతో సంయమనాన్ని పాటిస్తుంటే పుతిన్‌ ఇలాంటి ప్రకటనలు చేయడమేంటని అంటున్నాయి. కాని పుతిన్‌ని కొట్టిపారేయొద్దు. అతడి మాటలను లైట్‌ తీసుకోవద్దన్నది ఆయా దేశాల సైనికాధినేతల మనోగతం. ఇప్పటికిపుడు అణ్వాయుధాల లెక్కలు తీస్తే.. షాకింగ్‌ రిజల్సే వస్తున్నాయి. ఒక్కసారి ఈ మ్యాప్‌ చూస్తే.. ఏయే దేశంలో ఎన్ని న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉన్నాయో తెలుస్తుంది. ఈ బార్‌ చార్ట్‌లో మనకి క్లియర్‌ పిక్చర్‌ వస్తుంది. ఏ దేశాల్లో ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయి? ఎన్ని అణ్వాయుధాలు మిసైల్స్‌ రూపంలో ఎన్ని వార్‌హెడ్స్‌ రూపంలో ఉన్నాయొ తెలుస్తాయి.

ఇవి కూడా చదవండి: Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఉద్యోగం చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి