Russia Ukraine War: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం.. క్రీమియా ఎయిర్‌బేస్‌ను నామరూపాల్లేకుండా ధ్వంసం చేసిన రష్యా..
Russia-Ukraine ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది..దీంతో గుర్తుపట్టలేనంతగా క్రీమియా ఎయిర్‌బేస్ నాశనమైంది..అయితే క్రిమియాకు విముక్తితోనే యుద్ధం ముగ్గింపు అంటున్నారు జెలెన్‌స్కీ.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.. రష్యా దాడుల్లో క్రిమియా ఎయిర్‌బేస్ నామరూపాలు లేకుండా పోయింది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్స్ చూస్తుంటూనే భయం వేస్తోంది. రష్యా పాలిత క్రిమియాకు పశ్చిమాన ఉన్న సాకీ స్థావరం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. అయితే, రన్‌వేలు మాత్రం చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి..కానీ ఈ దాడుల్లో కనీసం ఎనిమిది విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్‌బేస్‌కు సంబంధించి US ప్లానెట్ ల్యాబ్స్ నుండి వచ్చిన శాటిలైట్ ఇమేజ్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. రష్యా ఉడుం పట్టు నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకొన్నప్పుడే యుద్ధానికి ముగింపు లభిస్తుందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్ యుద్ధం క్రిమియాతోనే మొదలైందని.. దాని విముక్తితోనే అది ముగుస్తుందన్నారు. క్రిమియా ఎప్పటికీ ఉక్రెయిన్‌దే.. ఎన్నటికీ వదిలిపెట్టబోం’’ అని స్పష్టం చేశారు.
2014లో రష్యా దళాలు క్రిమియాను ఆక్రమించుకొన్నాయి. కానీ, అధికారికంగా ఉక్రెయిన్‌లోని భాగంగానే చాలా దేశాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయి..క్రిమియాలోని రష్యా వాయుసేన స్థావరంపై భారీ ఎత్తున దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే జెలెన్‌స్కీ ప్రసంగించడం గమనార్హం.అయితే.. ఆయన తన ప్రసంగంలో క్రిమియాలో దాడుల అంశాన్ని ప్రస్తావించలేదు. రష్యా వాయుసేన స్థావరంలో మొత్తం 12 పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఒక పౌరుడు మరణించాడు. ఉక్రెయిన్ సైన్యం కూడా ఇప్పటివరకు ఈ దాడుల బాధ్యతను స్వీకరించలేదు.
క్రిమియాపై దాడుల్లో ఉక్రెయిన్ హస్తం ఉందని తేలితే యుద్ధం మరింత తీవ్రం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలైన తర్వాత క్రిమియాపై జరిగిన తొలి అతిపెద్ద దాడి ఇదే.తాజా దాడితో క్రిమియాలోని లక్ష్యాలపై ఉక్రెయిన్ ఓ వ్యూహం ప్రకారం దాడులు చేస్తోందనే భయాలు పెరిగిపోయాయి.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..