Kim Jong: జ్వరంతో వణికిపోతున్న కిమ్‌జోంగ్ ఉన్.. కీలక వివరాలను వెల్లడించిన అతని సోదరి..
Corona: దేశాధినేతల్లో కిమ్‌జోంగ్ ఉన్‌ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన. ఆఖరికి మిసైల్ ప్రయోగాలు చేసినా కూడా, అది నార్త్ కొరియన్ల కోసమే..

కిమ్, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎందుకంటే ఆయన ఏం చేసినా అది సంచలనమే. తాజాగా మరో కార్యం చేసి వార్తల్లో నిలిచారు కిమ్‌జోంగ్ ఉన్. దేశాధినేతల్లో కిమ్‌జోంగ్ ఉన్‌ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన. ఆఖరికి మిసైల్ ప్రయోగాలు చేసినా కూడా, అది నార్త్ కొరియన్ల కోసమే అంటుంటారు కిమ్. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆసక్తికి అంతులేదు. కొన్నిసార్లు అతని గురించి రకరకాల వార్తలు ముందుకు రావడం.. ఊహాగానాలు చేయడం. కానీ ఆ దేశంలో ప్రభుత్వ నియంత్రణ చాలా ఉంది. ఏ వార్తలోనూ నిజమెంతో ధృవీకరించడం సాధ్యం కాదు. ఈ సమయంలో అతని సోదరి కిమ్ యో జోంగ్ కిమ్ గురించి వివరాలను అందించింది. కిమ్ జాంగ్ ఉన్ ‘తీవ్ర జ్వరం’తో బాధపడుతున్నారని తెలిపింది. ఉత్తర కొరియాలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున కిమ్ జ్వరం అతని కుటుంబంలో మళ్లీ ఆందోళన కలిగించింది. కరోనా వైరస్ వ్యాప్తికి దక్షిణ కొరియా కారణమని కిమ్ సోదరి మరోసారి ఆరోపించింది.
బెలూన్ ద్వారా దక్షిణ కొరియా సరిహద్దులో ‘డర్టీ మ్యాటర్’ పంపడం ద్వారా ఉత్తర కొరియాకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని కిమ్ యో జోంగ్ చెప్పినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం నివేదించింది. దీనికి ముందు, ఉత్తర కొరియా పాలకుడి భౌతిక స్థితిపై అధికారికంగా ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కిమ్ సోదరి, యు జోంగ్ మాట్లాడుతూ.. కిమ్ జ్వరం బారిన పడ్డారని.. “తీవ్రమైన అనారోగ్యం” అని వెల్లడించింది. ‘దేశ పౌరుల గురించి ఆందోళన చెందుతున్నందున కిమ్ ఒక్క క్షణం కూడా పడుకుని విశ్రాంతి తీసుకోలేరని’ అని తెలిపింది. అయితే, కిమ్ ఎప్పుటి నుంచి అనారోగ్యంతో ఉన్నారో యో జోంగ్ వెల్లడించలేదు.
కిమ్ జోంగ్ ఉన్ స్థూలకాయంతోపాటు.. అతని చైన్ స్మోకింగ్ అలవాటును కారణంగా అతనిపై పుకార్లు వచ్చాయి. అతను ఎప్పుడు మీడియాలో కనిపించినా.. రకాలుగా గమనించడానికి ప్రయత్నిస్తారు. కిమ్‌కు గుండె జబ్బు సమస్య కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. కిమ్ జోంగ్ ఉన్ గత నెలలో 17 రోజుల పాటు ప్రభుత్వ మీడియాకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కిమ్ భౌతిక పరిస్థితిపై మళ్లీ ఊహాగానాలు వచ్చాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం