Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. తాలిబనీలకు కోలుకోలేని ఎదురుదెబ్బ.. పక్కా ప్లాన్‌తో..
Kabul Madrasa Attack: ఆత్మాహుతి దాడిలో తాలిబన్ సీనియర్ సభ్యుడు షేక్ రహీముల్లా హక్కానీ మరణించాడు.

ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) తాలిబన్లకు(Taliban) కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబన్ కీలకనేత రహీముల్లా హక్కానీ దుర్మరణం పాలయ్యారు. రహీముల్లా హక్కానీ తన ఇంట్లో ఉన్న సమయంలో వచ్చిన ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఐసిస్ హస్తమున్నట్టు గుర్తించారు. 2013 , 2020 లో కూడా రహీముల్లాపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేశారు. అతనిపై దాడి అక్టోబర్ 2020లో కూడా ఒకసారి జరిగింది. అయితే హక్కానీపై దాడి జరగడం ఇది మూడోసారి. 2013లో పెషావర్‌లోని రింగ్ రోడ్డులో అతని కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారు. అయితే అతను సురక్షితంగా తప్పించుకోగలిగాడు.
షేక్ రహీముల్లా హక్కానీ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని నంగర్హర్ ప్రావిన్స్‌లోని పచిర్ అవ్ అగామ్ జిల్లా నివాసి. హక్కానీ హదీసులో మంచి ప్రావీణ్యం కలిగి వ్యక్తి. స్వాబి, అకోరా ఖట్టక్ దేవబంది మదర్సాల నుంచి తన చదువును పూర్తి చేశాడు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. రహీముల్లా నంగర్హర్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ మిలటరీ కమిషన్‌లో కూడా సభ్యుడు. తరువాత US సైన్యం అతన్ని అరెస్టు చేసింది. చాలా సంవత్సరాలు బాగ్రామ్ జైలులో శిక్ష అనుభవించాడు. అతను 9 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో ఉంటున్నాడు. వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్న మదర్సా జుబేరిని కొన్నేళ్ల క్రితం స్థాపించాడు.
హదీసు గురించి ఫేస్‌బుక్ పేజీ కేంద్రంగా రహీముల్లా హక్కానీ పలు పోస్టులు పెడుతున్నాడు. అతను యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నిర్వహిస్తున్నాడు. హదీత్, హనాఫీ, దేవబందిని ఈ యూట్యూబ్ కేంద్రంగా బోధించాడు. అతనికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది అనుచరులు ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..