Deadly Creatures: వీటి విషం 100 కోబ్రాలతో సమానం.. భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులివి..
విషపూరిత జీవుల లిస్టు తీస్తే అందులో భారీ పాములు, ప్రాణాంతకమైన తేళ్లు లేదా ప్రాణాంతకమైన సాలెపురుగుల గురించే తరచుగా గుర్తుకు వస్తాయి. కానీ సైజు మ్యాటర్ కాదు. వీటికుండే పవర్ ముందు పెద్ద పెద్ద కోబ్రాలైన, విషం చిమ్మే నాగుపాములైనా దిగదుడుపే. భూమి మీద మనం అస్సలు ఊహించని సామర్థ్యాలున్న కీటకాలివి. ఇవి గానీ కుడితే ఆ వ్యక్తికి మరణం తప్ప మరో ఆప్షన్ ఉండదు. అంత డేంజరస్ జీవులివి.

విషపూరిత జీవుల గురించి ఆలోచిస్తే, పెద్ద పాములు, తేళ్లు, సాలెపురుగులు గుర్తుకు వస్తాయి. కానీ పరిమాణం శక్తి సామార్థ్యాలను నిర్ణయించదు అని వీటి గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. చూడ్డానికి ఇవి చిన్న జీవులే కానీ భయంకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మ జీవులు తమ విషం సాయంతో తమ ఆహారాన్ని సంపాదించుకోగలవు. అలాగే తమ రక్షణకు లేదా శత్రువులను చంపడానికి వాటి విషాన్ని తెలివిగా ఉపయోగిస్తాయి. వీటి గురించి మీకు తెలుసా..?
ఇరుకండ్జీ జెల్లీ ఫిష్:
ఒక సెంటీమీటర్ పరిమాణంలోనే ఉంటుందీ సముద్ర జీవి. ఆస్ట్రేలియా జలాల్లో కనిపించే ఇది, నాగుపాము కంటే 100 రెట్లు శక్తివంతమైన విషంతో ఇరుకండ్జీ సిండ్రోమ్‌ను కలిగిస్తుంది. ఇది కుడితే తీవ్ర నొప్పి, వికారం, గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయి.
బ్లూ-రింగ్డ్ ఆక్టోపస్:
5-8 అంగుళాల చిన్న జీవి, అందమైన నీలి వలయాలతో కనిపిస్తుంది. కానీ దీని టెట్రోడోటాక్సిన్ విషం 26 మందిని నిమిషాల్లో చంపగలదు. విరుగుడు లేని దీని విషం పక్షవాతం, శ్వాస వైఫల్యాన్ని తెస్తుంది.
బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్:
అరటి తోటల్లో దాగే ఈ సాలీడు చాలా చిన్నది కానీ దూకుడుగా ఉంటుంది. దీని న్యూరోటాక్సిన్ విషం.. నొప్పి, పక్షవాతం, మరణాన్ని కలిగిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సాలీడుగా గిన్నిస్ రికార్డు కలిగి ఉంది.
కోన్ నత్త:
ఉష్ణమండల జలాల్లోని ఈ అందమైన జీవి కోనోటాక్సిన్ విషంతో ఎరను, మానవులను తక్షణం చంపగలదు. ఇది కుడితే చికిత్స లేక ఊపిరాగిపోతుంది.
డెత్‌స్టాకర్ స్కార్పియన్:
2.5 అంగుళాల ఈ తేలు, ఎడారుల్లో కనిపిస్తుంది. దీని వల్ల నొప్పి, జ్వరం, మూర్ఛ కలుగుతాయి. తద్వారా వారు మరణిస్తారు.
హార్వెస్టర్ చీమ:
దీని విషం తేనెటీగ కంటే 20 రెట్లు శక్తివంతం. పెద్ద జంతువులను కూడా స్తంభింపజేస్తుంది.