OG: అదిదా సర్‌ప్రైజు.. OTT చేతిలో OG ఫ్యూచర్..
ఓజి ఇదే ఏడాది విడుదల కానుందా..? విడుదల చేయాల్సిన విపత్కర పరిస్థితులు మేకర్స్ ముందున్నాయా..? ఎప్పుడో పూర్తి చేసిన ఓటిటి డీల్.. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ను శాసిస్తుందా..? 2025లో ఓజి రిలీజ్ చేయకపోతే దర్శక నిర్మాతలకు భారీ నష్టం తప్పదా..? అసలు వీటన్నింటిపై పవన్ ఏమంటున్నారు..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..!
Updated on: Mar 31, 2025 | 9:50 PM

పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఉంది ఓజి. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ముందుగానే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయిప్పుడు. అదేంటి పవన్ డేట్స్ ఇవ్వకుండా అదెలా సాధ్యం అనుకోవచ్చు.. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి మరి. దాంతో పవన్ కూడా మనసు మార్చుకుని ఓజి పూర్తి చేయక తప్పేలా లేదు.

ఓజి షూటింగ్‌కు పవన్ వచ్చి ఏడాది దాటేసింది. అప్పట్లో ఆయనిచ్చిన కొన్ని డేట్స్‌తోనే దాదాపు 70 శాతం పూర్తి చేసారు సుజీత్. ఆ తర్వాత పవన్ లేని సీన్స్ కూడా చాలా వరకు తీసారు ఈ దర్శకుడు.

మరో 14 రోజులు డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తైపోతుంది. కానీ అంతలోపే ఎన్నికలు రావడం.. పవన్ డిప్యూటి సీఎం కావడం.. బిజీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి.

పవన్ బిజీ చూసాక.. ఓజి 2025లో రావడం కష్టమే అని ఫిక్సైపోయారు అభిమానులు. మే 9న రానున్న హరిహర వీరమల్లుతో సరిపెట్టుకోవాల్సిందే అనుకున్నారంతా. కానీ అప్పుడెప్పుడో పూర్తి చేసిన ఓటిటి డీల్ కారణంగా ఓజిని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్‌లోపు విడుదల చేయాల్సిందే.. లేదంటే చెప్పిన రేటులో సగానికి పైగా కోత తప్పదని తెలుస్తుంది. ఈ రోజుల్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఓటిటి సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓజిని 2025 సెప్టెంబర్‌లో చేసేలా డీల్ కుదిరింది. దాంతో మే లోపు షూట్ పూర్తి చేసి.. దసరాకు విడుదల చేద్దామని మేకర్స్‌కి పవన్ మాటిచ్చినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం.. 3 నెలల గ్యాప్‌లోనే పవన్ నుంచి వీరమల్లు, ఓజి వస్తాయి. అదే జరిగితే ఫ్యాన్స్‌కు పండగే పండగ.




