- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun and Director Atlee Upcomoing Movie Updates To Be Release On April 8th
Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 భారీ సక్సెస్ తర్వాత బన్నీ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
Updated on: Mar 31, 2025 | 9:41 PM

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్నాళ్లుగా టాక్ నడుస్తుంది.

వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకనట వెలువడలేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8, 2025న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా రివీల్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషళ్ మీడియాలో వైరలవుతుంది. దీనికి సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

అట్లీ దర్శకత్వం వహించిన చివరి చిత్రం జవాన్. ఈ చిత్రంలో బాలీవుడ్ హిట్ నటుడు షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. 2023లో విడుదలైన ఈ చిత్రం 1000 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

అట్లీ దర్శకత్వం వహించనున్న సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఈ సమాచారం ఎంతవరకు నిజమో తెలియరాలేదు.





























