Telangana: గుడ్డును చీల్చుకుంటూ పాము పిల్ల బయటకు రావడం మీరెప్పుడైనా చూశారా..?
పక్షులు, కోళ్లు మొదలైన కొన్ని పక్షి జాతికి చెందిన జీవులు తమ గుడ్లను పొదగడం ద్వారా తమ పిల్లలకు జన్మనిస్తాయి. అయితే అలాంటి అద్భుతాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. కానీ ఇప్పడు మీరొక అద్భుతాన్నిచూడబోతున్నారు. అది పక్షలకు సంబంధించింది కాదు గానీ.. గుడ్డునుండి పిల్లలు బయటకు వస్తున్న అద్భుత దృశ్యం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది. దీంతో పాములు వేడి తాపానికి.. జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తత అవసరం. అయితే కొందరు పాములు ఇళ్లలోకి వస్తే వెంటనే చంపడం చేస్తుంటారు. అలా చేయకూడదు. అది కూడా ఒక జీవే.. జీవవైవిద్యానికి పాములు కూడా అవసరం అన్నది గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే.. అన్ని పాములు విషపూరితమైనవి కాదు.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లబాద్ గ్రామంలోని ఓ ఇంటిలో పాము కనిపించింది. దీంతో గ్రామస్థులు స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చారు. కాసేపటికి వారు అక్కడికి చేరుకుని పామును రక్షించారు. అది నీరు గట్టు పాముగా గుర్తించారు. అయితే ఆ ఇంటి వద్దే పాము పెట్టిన 21 గుడ్లను కూడా గుర్తించారు. ఆ గుడ్లను జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని బయోడైవర్సిటీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ సెంటర్లో పొదగేశారు. కొన్ని రోజులకు గుడ్లను చీల్చుకుని పాము పిల్లలు బయటికి వచ్చాయి. 21 గుడ్లు ఉండగా దాదాపు 15 పాము పిల్లలు బయటికి వచ్చాయి. ఈ కాలంలో నీరు గట్టు పాములు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయని స్నేక్ క్యాచర్ తెలిపారు.
వీడియోలు దిగువన చూడండి
————————————————————-