AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్డ్ ఫ్లూతో బాలిక మృతి.. ఎలుకలు కూడా కారణం అంటున్న వైద్య నిపుణులు!

రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై కేంద్ర వైద్య బృందం అధ్యాయనం చేపట్టనుంది. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు ఇప్పటికే బాలికకు సన్నిహితంగా ఉన్నవారి రక్త నమూనాలను పరీక్షించారు. బర్డ్ ఫ్లూతో పాటు, లెప్టోస్పైరోసిస్ కూడా బాలికకు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

బర్డ్ ఫ్లూతో బాలిక మృతి.. ఎలుకలు కూడా కారణం అంటున్న వైద్య నిపుణులు!
Bird Flu
SN Pasha
|

Updated on: Apr 03, 2025 | 8:54 AM

Share

రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బర్డ్‌ఫ్లూ సోకి తొలి మరణ సంభవించడంతో అంతా అలెర్ట్‌ అయ్యారు. చిన్నారి మరణంపై అధ్యాయం జరిపేందుకు ఈ రోజు(గురువారం, ఏప్రిల్‌ 3) నరసరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటించనుంది. రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడానికి కారణాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. నరసరావుపేటలో పర్యటించనున్న ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ముగ్గురు, ముంబయి నుంచి ఒకరు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒకరు పాల్గొంటున్నారు. ఇప్పటికే మంగళరిగి ఎయిమ్స్‌ వైద్య నిపుణులు బాలికకు సన్నిహితంగా ఉన్న తొమ్మిది మంది నుంచి, సమీప చికెన్ దుకాణాల వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎవరికీ వైరస్ సోకనట్టు నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ మరణం తరువాత ఈ తరహా కొత్త కేసులేవీ నమోదు కాలేదని కూడా మంగళగిరి ఎయిమ్స్ ప్రకటించింది.

ఇన్ఫ్లూయెంజా- ఏ స్పొరాడిక్ కేసుగా గుర్తింపు..

ఇన్ఫ్లూయెంజా ఉపరూపాంతరమైన ఇన్ఫ్లూయెంజా- ఏ స్పొరాడిక్ కేసుగా దీనిని గుర్తించారు. ఇది వ్యాప్తి చెందదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన చిన్నారికి బర్డ్ ఫ్లూతో పాటు లెప్టోస్పైరోసిస్ కూడా ఉన్నట్టు ఎయిమ్స్ నిర్ధారించింది. బాలిక ఇంటి పరిసరప్రాంతల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నందువల్ల లెప్టోస్పైరోసిస్ సోకి ఉండొచ్చని ఎయిమ్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి కేంద్ర వైద్య బృందం అధ్యాయం చేసిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి