Russia Ukraine War: వార్ ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న బీర్ కంపెనీలు..
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. 33 రోజుల నుంచి రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే వేలాది మంది మరణించగా..
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. 33 రోజుల నుంచి రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే వేలాది మంది మరణించగా.. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. మూడు దఫాలుగా జరిగిన చర్చలు కూడా విఫలమవ్వడంతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం సైతం.. రష్యా దాడులను తిప్పికొడుతోంది. అయితే.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలంటూ అగ్రరాజ్యం అమెరికా సహా బ్రిటన్, జపాన్ నాటో దళాలు రష్యాను సూచించాయి. రష్యాలో పెట్టుబడులను సైతం నిలిపివేస్తున్నామని.. వ్యాపార దిగ్గజాలు పేర్కొన్నా రష్యా ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. దీంతోపాటు పలు అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో పెట్టుబడులను, వ్యాపార కార్యకలాపాలను ఉపసంహరించుకున్నాయి. అయితే తాజాగా మరో కంపెనీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద బీర్ ఉత్పత్తిదారు బ్రూయింగ్ కంపెనీ Ab Inbev రష్యా నుంచి నిష్క్రమిస్తున్నట్లు పేర్కొంది. రష్యన్ ఫెడరేషన్‌లో బడ్ (Budweiser) బ్రాండ్‌ను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని అబ్ ఇన్‌బెవ్ ఆదేశించింది. ప్రపంచ మార్కెట్లో Ab Inbev వాటా 28 శాతంగా ఉంది.
ఈ కంపెనీతోపాటు పాశ్చాత్య బ్రూయింగ్ దిగ్గజాలు కార్ల్స్‌బర్గ్, హీనెకెన్ రష్యాను విడిచిపెడుతున్నట్లు సోమవారం వెల్లడించాయి. రష్యాలో తమ వ్యాపారాన్ని నిలిపివేసేందుకు తక్షణ నిర్ణయం తీసుకున్నామని.. ప్రస్తుత వాతావరణంలో ఇదే సరైనదని తాము విశ్వసిస్తున్నట్లు కార్ల్స్‌బర్గ్ చెప్పారు. రష్యాలో తమ కంపెనీ ఉనికే ఉండదని పేర్కొన్నారు. కాగా.. యుద్ధం నాటినుంచి కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ నిర్ణయం తర్వాత సోమవారం కంపెనీ షేర్లు 4.2% అధికంగా పెరిగాయి.
The world’s largest beer producer is leaving #Russia
The brewing company Ab Inbev has ordered the suspension of its license to produce and sell the Bud brand in the Russian Federation.
The share of Ab Inbev in the world market is estimated at 28%. pic.twitter.com/7c5PhtJMUg
— NEXTA (@nexta_tv) March 28, 2022
రష్యాలో మూడవ అతిపెద్ద బ్రూవర్ హీనెకెన్ కూడా కంపెనీ కార్యకలాపాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. వరుసగా రష్యా నుంచి కంపెనీలు పెట్టుబడులను, వ్యాపారాలను ఉపసంహరించుకుంటుంటంతో భారీగా నష్టం ఏర్పడుతుందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి కూడా సహాయం అందించనున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.
Also Read: