Mexico Shooting: మెక్సికోలో మారణహోమం.. 19 మందిని చంపిన దుండగులు..

Mexico Shooting: మెక్సికోలో కోడి పందాల స్థావరంలో మారణహోమం చోటుచేసుకుంది. గ్యాంగ్‌వార్‌తో ఆ బరి మరు భూమిగా మారింది. దీంతో కోడి పందాల్లో

Mexico Shooting: మెక్సికోలో మారణహోమం.. 19 మందిని చంపిన దుండగులు..
Mexico Shooting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2022 | 11:04 PM

Mexico Shooting: మెక్సికోలో కోడి పందాల స్థావరంలో మారణహోమం చోటుచేసుకుంది. గ్యాంగ్‌వార్‌తో ఆ బరి మరు భూమిగా మారింది. దీంతో కోడి పందాల్లో మనుషుల రక్తం ఏరులై పారింది. సెంట్రల్ మెక్సికోలోని లాస్‌ టినాజస్‌ అనే పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు స్టేట్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం (FGE) వెల్లడించింది. మెక్సికో మిచోవాకాన్ రాష్ట్రంలో గుట్టుగా నిర్వహిస్తున్న కోడి పందాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలంగా అక్కడ పోలీసుల కన్నుగప్పి కోడి పందాలు, భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. చుట్టుపక్కల పందాలరాయుళ్లు అక్కడికి వస్తున్నారు. సీక్రెట్‌గా కోడి పందాలు, బెట్టింగ్‌లు జరిగిపోతున్నాయి. అక్కడ ఏం గొడవైందో తెలియదు కానీ మారణహోమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

అరుపులు కేకలతో గోలగోలగా ఉండే ఆ పందాల చోటులో తూటాలు పేలాయి. కొందరు వ్యక్తులు విచాక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులు జరిపింది ఎవరు? కారణమేంటి? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మెక్సికోలో ఈ ప్రాంతం అరాచకాలకు చిరునామాగా ఉంది. లా అండ్‌ ఆర్డర్‌ లేదు. డ్రగ్‌ రూట్స్‌పై కంట్రోల్‌ కోసం గ్యాంగ్‌ల మధ్య వార్‌ జరుగుతోంది. రైతులను బెదిరించి డబ్బు వసూలు చేయడం కూడా గ్యాంగ్‌ల నిత్యకృత్యంగా ఉంది. గ్యాంగ్‌ వారే ఈ మారణహోమానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతన్నాయి.

Also Read:

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..

Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!