Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు.. మాట వినకపోతే.. బ్లాక్ చేస్తామంటూ హెచ్చరిక

Russia Restricts Use Of Twitter: సోషల్ మీడియా సంస్థలపై ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు వెల్లవెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఫేస్‌బుక్ మధ్య వివాదం తలెత్తి అనంతరం సద్దుమణిగింది. ఈ క్రమంలో రష్యా కూడా మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్‌పై..

Russia: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు.. మాట వినకపోతే.. బ్లాక్ చేస్తామంటూ హెచ్చరిక
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2021 | 9:11 PM

Russia Restricts Use Of Twitter: సోషల్ మీడియా సంస్థలపై ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు వెల్లవెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఫేస్‌బుక్ మధ్య వివాదం తలెత్తి అనంతరం సద్దుమణిగింది. ఈ క్రమంలో రష్యా కూడా మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్‌పై ఆంక్షలు మొదలుపెట్టింది. ట్విట్టర్‌లో ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేయడంలో స్పీడ్‌ తగ్గిస్తూ ఆంక్షలు జారీ చేసింది. ట్విట్టర్ నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైందని.. అందుకోసం ఈ ఆంక్షలు కొనసాగిస్తున్నామంటూ రష్యా ప్రకటించింది. అమెరికాకు చెందిన ట్విట్టర్ ఈ ఆంక్షలను పాటించకపోతే దేవంలో మొత్తం సంస్థనే బ్లాక్‌ చేస్తామంటూ హెచ్చరించింది.

నిషేధిత కంటెంట్‌లను తొలగించడంలో మొత్తానికి ట్విట్టర్ ఫెయిల్ అయిందంటూ స్పష్టంచేసింది. పిల్లల్లో ఆత్మహత్యలను ప్రేరేపించడం, డ్రగ్స్‌, చైల్డ్‌ పోర్నోగ్రఫీ వంటి నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో ట్విట్టర్ విఫలమైందని.. ప్రభుత్వ నియమాలను పాటించలేదని రష్యా సమాచార నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జోర్ వెల్లడించింది. దీనిపై ట్విట్టర్‌ సరైన రీతిలో స్పందిస్తుందనే నమ్మకం తమకు ఉందని… కానీ.. రష్యా చట్టాలను అమలు చేయకపోతే పూర్తిగా నిషేధిస్తామంటూ రష్యా సమాచార నియంత్రణ శాఖ హెచ్చరిస్తూ ప్రకటనను విడుదల చేసింది.

దీనిపై రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రియ్‌ పెస్కోవ్‌ స్పందించారు. సోషల్ మీడియా సంస్థలపై నిషేధం విధించాలనే కోరిక తమ ప్రభుత్వానికి లేదని, కానీ చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. లేకపోతే చర్యలు తప్పవంటూ ఆయన స్పష్టంచేశారు.

అయితే.. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై రష్యా ఆంక్షలు విధించడానికి పలు కారణాలు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రష్యా ప్రతిపక్ష నాయుకుడు అలెక్సీ నావెల్నీని ప్రభుత్వం అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నావెల్నీని విడుదల చేయాలంటూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలకు ట్విట్టర్‌ వంటి సోషల్ మీడియా సంస్థలే కీలకంగా వ్యవహరించాయని రష్యా ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

Also Read:

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?