Putin in Mariupol: ఉక్రెయిన్ యుద్ధప్రభావిత ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు ఆకస్మిక పర్యటన.. స్థానికులతో మాట్లాడిన పుతిన్
రష్యా దాడుల్లో శిథిలమైన మారియపోల్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు పుతిన్. ఓ వైపు ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు యుద్ధక్షేత్రంలో హఠాత్తుగా అడుగుపెట్టాడు పుతిన్.

ఓ వైపు ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియపోల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకస్మిక పర్యటన చేసి అందర్నీ షాక్‌కి గురిచేశారు. రష్యా క్షిపణి దాడుల్లో పూర్తిగా ధ్వంసమై, మరుభూమిలా మారిన శిథిల శకలాల్లో హెలికాప్టర్లో దిగాడు పుతిన్.
ఓ వైపు ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతుండగానే పుతిన్ మేరియుపోల్‌లో అడుగుపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేరియుపోల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లిన పుతిన్.. యుద్ధప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాదు.. పర్యటన సందర్భంగా అక్కడక్కడా ఆగి జనంతో మాట్లాడిన దృశ్యాలు అక్కడి ఛానల్స్‌లో ప్రసారం అయ్యాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన అనంతరం పుతిన్ యుద్ధప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో పుతిన్ జనంతో మాట్లాడుతున్న దృశ్యాలను స్థానిక ప్రభుత్వ ఛానల్స్ ప్రసారం చేశాయి. విధ్వంసం అనంతరం తమ అపార్ట్‌మెంట్లను పున నిర్మిస్తున్నందుకు పుతిన్‌కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపుతున్నట్టు రికార్డు అయ్యింది.
మారియపోల్‌లోని సగం మంది ప్రజలు రష్యన్ దాడుల్లో మృత్యువాత పడినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించిన నేరానికి పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఇదే తరుణంలో పుతిన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
రష్యాని గతంలో ఆక్రమించుకున్న క్రిమియాలో సైతం పుతిన్ ఇటీవల పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ఒక బాలల కేంద్రాన్ని సందర్శించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..