Rai Typhoon: ఫిలిప్పీన్స్​లో రాయ్‌ తుఫాను బీభత్సం.. 208 మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు..

Rai Typhoon: ఫిలిప్పీన్స్​ దేశంలో "రాయ్‌ తుఫాను" బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి ఆదేశంలో జన జీవన అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 208లకు..

Rai Typhoon: ఫిలిప్పీన్స్​లో రాయ్‌ తుఫాను బీభత్సం.. 208 మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు..
Philippines
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2021 | 8:30 AM

Rai Typhoon: ఫిలిప్పీన్స్​ దేశంలో “రాయ్‌ తుఫాను” బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి ఆదేశంలో జన జీవన అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 208లకు చేరుకుందని ఆ దేశ అధికారులు చెప్పారు. ఆ దేశంలో ఇటీవల కాలంలో తుఫాను వలన ఒకేసారి ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారి. రాయ్​ తుఫాను గంటకు 195 కిలోమీటర్లు (120 మైళ్లు) వేగంతో గాలులు వీచినట్లు అధికారులు చెప్పారు. తీవ్ర గాలుల ధాటికి సియార్‌గావ్, దినాగట్, మిండనావో దీవుల్లో కూడా భారీ విధ్వంసం జరిగింది. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇక ఆర్చిపెలాగోలోని సౌథర్న్‌, సెంట్రల్‌ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని పోలీసులు చెప్పారు. రాయ్ తుఫాన్ సృష్టించిన విధ్వసంతో ఫిలిప్పీన్స్​ లోని కోస్తా ప్రాంతం మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని రెడ్‌క్రాస్‌ సంస్థ చెప్పింది.

అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

సియార్‌గావో ద్వీపంలోని ప్రముఖ పర్యాటక పట్టణం జనరల్ లూనాలోకి క్రిస్మస్  సందర్భంగా భారీగా పర్యాటకులు వచ్చారు. అయితే ఇప్పుడు తుఫాన్ ద్వీపంలో సృష్టించిన విధ్వసంతో స్థానికులు సహా పర్యాటకులు మంచి నీరు, ఆహారం కోసం కష్టపడుతున్నారు. దేశ వ్యాప్తంగా తుఫాను నష్టం పూర్తి స్థాయిని అంచనా వేయడానికి విపత్తు ఏజెన్సీ రంగంలోకి దిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది.  బాధితులకు సహాయం కోసం వేలాది మంది మిలిటరీ, పోలీసు, కోస్ట్ గార్డ్ , అగ్నిమాపక సిబ్బంది,  రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి.. తుఫాన్ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

ఆహారం, నీరు , వైద్య సామాగ్రిని తరలించారు.  రోడ్లపై పడిపోయిన విద్యుత్ స్తంభాలు, చెట్లను క్లియర్ చేస్తున్నారు.   ఫిలిప్పీన్స్‌  లో ఎక్కువగా తుఫానులు సాధారణంగా జూలై  – అక్టోబర్ మధ్య ఏర్పడతాయి. రోజు రోజుకీ  వాతారణంలో కలిగే  మార్పుల కారణంగా ప్రపంచం వేడెక్కుతున్నందున తుఫాన్లు మరింత శక్తివంతం అవుతున్నాయని శాస్త్రవేత్తలు  గత కొంత కాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  సన్నీ విన్నర్‌గా నిలవడంపై తల్లి కళావతి హర్షం.. స్నేహానికి విలువ ఇస్తాడంటూ..

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?