Queen Elizabeth II: అట్టహాసంగా బ్రిటన్ రాణి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్.. ఆ ఘనత ఆమెకే సొంతం..
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు వేడుకలు కొనసాగుతాయి.
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు వేడుకలు కొనసాగుతాయి. బ్రిటన్ రాచసింహాసనాన్ని అత్యధిక కాలం అధిష్టించిన ఘనత క్వీన్ ఎలిజబెత్-2దే. ఆమె కిరీటాన్ని ధరించి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశమంతటా ఉత్సవాలు ప్రారంభయ్యాయి. లండన్ మహానగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. వీధుల్లో బ్రిటన్ జాతీయపతాకం యూనియన్ జాక్‌లను వ్రేలాడ దీశారు. నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు బకింగ్‌హామ్ ప్యాలస్‌కు తరలి వచ్చారు. ప్యాలస్ బాల్కనీ నుంచి దర్శనం ఇవ్వడం ద్వారా క్వీన్ ఎలిజబెత్-2 వేడుకలను ప్రారంభించారు. ఆమెతో పాటు ప్రిన్స్ ఛార్లెస్ ఇతర కుటుంబ సభ్యులు ప్రజలు అభివాదం చేశారు. ఆకాశంలో వాయుసేన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌లో కలర్‌ఫుల్ పరేడ్‌లో పాల్గొన్నారు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కేట్, ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ అన్నే.. సాంప్రదాయానుసారం అందంగా అలంకరించిన గుర్రాల కాన్వాయ్‌తో ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బగ్లీల్లో కూర్చొన్న వీరంతా ప్రజలను అభివాదం చేస్తూ ముందుకుసాగారు. మరోవైపు బ్రిటన్ కామన్వెల్త్ సభ్యదేశం ఆస్ట్రేలియాలోనూ క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఒపెరా హౌస్‌ను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలకంరించారు.