AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: ఈ వస్తువులను ఇంటి నైరుతి దిశలో ఉంచండి.. డబ్బుతో పాటు అనేక ప్రయోనాలు కలుగుతాయట..!

Vastu tips: ఎవరైనా సరే తమ ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. ఇల్లు నిర్మాణం సమయంలోనే వాస్తు ప్రకారం ఇంటిని డిజైన్ చేయిస్తారు.

Vastu tips: ఈ వస్తువులను ఇంటి నైరుతి దిశలో ఉంచండి.. డబ్బుతో పాటు అనేక ప్రయోనాలు కలుగుతాయట..!
Vastu Tips
Shiva Prajapati
|

Updated on: Jun 01, 2022 | 6:00 PM

Share

Vastu tips: ఎవరైనా సరే తమ ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. ఇల్లు నిర్మాణం సమయంలోనే వాస్తు ప్రకారం ఇంటిని డిజైన్ చేయిస్తారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే.. పాజిటివ్ ఎనర్జీ కలిగి జీవితం ప్రశాంతంగా, సుఖసంతోషాలతో సాగుతుందని ప్రజల విశ్వాసం. అయితే, ఇంటి నిర్మాణమే కాదు.. ఇంట్లో ఏర్పాటు చేసే వస్తువులను కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేయాలంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే దాని ప్రభావం కుటుంబంపై పడుతుంది. శారీరకంగా, మానసికంగా కలవరపెడుతుంది. ఈ కారణంగా ఇంట్లో వస్తువులను పెట్టేటప్పుడు సరైన దిశలో ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం అని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఇవాళ మనం నైరుతి దిశకు సంబంధించిన వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం. వాస్తు ప్రకారం.. ఇంటి నైరుతి దిశ ఎంతో ముఖ్యమైనది. ఇంట్లోని ఈ మూల స్థిరత్వాన్ని సూచిస్తుందని విశ్వాసం. అందుకే ఈ దిశలో ఏవైనా వస్తువులు ఏర్పాటు చేసే ముందు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తు పండితులు. వాటిని పాటిస్తే.. జీవితంలో సంతోషం, శ్రేయస్సు సిద్ధిస్తుందట. ఇక ఈ దిశకు సంబంధించిన వాస్తు దోషాలు ప్రభావితం చేయడం ప్రారంభమైతే.. మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పండితులు. అనవసరపు ఖర్చులు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి నైరుతి దిశలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారీ వస్తువులు.. నైరుతి దిశలో ఏదైనా ఉంచాలనుకుంటే.. అది భారీ వస్తువు అయి ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. కావాలంటే ఆ దిశలో ఒక వార్డ్‌రోబ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో నగదు, ఇతర ఖరీదైన వస్తువులు పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక పరమైన సమస్యలు దూరమవుతాయట.

ఇవి కూడా చదవండి

విండ్ చైమ్స్.. చాలా సార్లు ఇంట్లో ఉండే ప్రతికూల వాతావరణం జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఇంటికి నైరుతి దిశలో విండ్ చైమ్స్, పిరమిడ్లు, శుభప్రదమైన మొక్కలు నాటినట్లయితే అది ఇంట్లో ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. వీటిని ఇంట్లో ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గణేషుడి విగ్రహం.. కొంతమంది ప్రజలు తమ ప్రధాన ద్వారా నైరుతి దిశలో ఉండేలా ఇంటి నిర్మాణం చేపడుతారు. ఇంట్లో వాస్తు దోషాలకు ఇది కూడా ఒక కారణం కావొచ్చు. అయితే, ఈ దోషాలను సులభంగా తొలగించవచ్చంటున్నారు వాస్తు నిపుణులు. అదెలాగంటే.. వాస్తు ప్రకారం ఆ దిశలో తలుపు దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అలా చేయడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి.. కుటుంబ సభ్యుల జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే