Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా వార్‌లో ఇతర దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్.. ఎందుకంటే..!
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై భీకర పోరు కొనసాగిస్తున్న రష్యా.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. యుద్ధాల కారణంగా..
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై భీకర పోరు కొనసాగిస్తున్న రష్యా.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. యుద్ధాల కారణంగా ఇరుదేశాల మధ్య ఎంతో నష్టం వాటిల్లింది. ఇక ఇతర దేశాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఆయుధాలను సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మీద ముప్పేట దాడులను కొనసాగిస్తూనే ఉంది రష్యన్ ఆర్మీ.. కీలక నగరాల మీద దాడులు కొనసాగుతునూ ఉన్నాయి. ఉక్రెయిన్‌కు ఇతర దేశాల నుంచి అందుతున్న ఆయుధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలపై మండిపడ్డారు. ఈ ఆయుధాల సరఫరా ఆగకుంటే దాడులు మరింత తీవ్రంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఆయుధాలను ఇస్తున్నారని ఆరోపించారు.. అమెరికా ఇస్తున్న ఆయుధాలు ఉక్రెయిన్ దగ్గర ఇప్పటికే ఉన్నాయని, అక్కడ నిల్వలు పెరగడం తప్ప ఎలాంటి ఫలితం లేదని వ్యాఖ్యానించారు పుతిన్. అలాగే మరోవైపు తన సైనికుల పోరాట ప్రతిమను ప్రశంసలు కురిపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.
ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా..
ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా తాజాగా రాజధాని కీవ్ మీద రాకెట్లతో విరుచుకుపడింది రష్యన్ ఆర్మీ. ఇందులో ఓ క్షిపణి పివ్‌డెనౌక్రెయిన్స్క్ అణు కర్మాగారానికి దగ్గర పడటం ఆందోళన కలిగించింది. రియాక్టర్ మీద పడితే విపత్తు తీవ్రంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేసింది ఉక్రెయిన్ ఆర్మీ. ఇక రష్యా యుద్ధం చేస్తోన్న లుహాన్‌స్క్, దొనెస్క్ ప్రాంతాలను ఉక్రెయిన్ అధినేత వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సందర్శించారు. అక్కడి ఉక్రెయిన్ సైనికుల పోరాటపటిమను ప్రశంసించారు. సైనికులు, ప్రజలను ఆయన కలుసుకున్నారు. తాను కలుసుకున్నవారిని చూస్తే తనకు గర్వంగా ఉందని జెలెన్‌స్కీ చెప్పారు.
మరోవైపు ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ పంపేందుకు బ్రిటన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది.. రష్యా బెదిరింపులను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఆ దేశ రక్షణకు ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఎంతో కీలకమని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి